జ‌న‌సేన నేత జైలుకు

జ‌న‌సేన నేత జైలుకు

జ‌నంలోకి రాకుండానే జ‌న‌సేన పార్టీ నేత‌లు జైలు బాట ప‌డుతున్న‌ట్లుంది. జ‌న‌సేన‌ పార్టీ అధికార ప్రతినిధి, పవన్ కళ్యాణ్ ఫాన్స్ నాయకుడు కళ్యాణ్ సుంకర అరెస్ట్ అయ్యాడు. హైదరాబాద్ నార్త్ జోన్ పరిధిలో కళ్యాణ్ సుంకర హల్చల్ చేశాడు. ఓఎల్ఎక్స్‌లో ఐ ఫోన్ 7 అమ్ముతానని పెట్టి డమ్మీ ఫోన్ అమ్మిన కళ్యణ్ సుంకరను పోలీసులు అరెస్ట్ చేశారు.

డమ్మీ ఫోన్ ఎందుకు అమ్మారని ప్రశ్నించిన వ్యక్తిని కళ్యాణ్ సుంకర ఎయిర్ గన్‌తో బెదరించాడు. కళ్యాణ్ దగ్గర నుంచి పోలీసులు ఫోర్డ్ ఎండీవర్ కార్, ఎయిర్ గన్‌ని స్వాధీనం చేసుకున్నారు. జనసేన తరపున కళ్యాణ్ సుంకర న్యూస్ ప‌లు ఛానెల్స్‌లో చర్చల‌కు హాజ‌ర‌య్యారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌నంలోకి రాకుండా ట్విట్ట‌ర్ లో గ‌డుపుతుంటే ఆ పార్టీ నేత‌లు ఇలా జ‌నాల‌ను బెదిరిస్తున్నారు.

(Visited 166 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *