October 22, 2017

కేసీఆర్ గురించి దాదా త‌న పుస్త‌కంలో ..

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గురించి, ఆయ‌న గొప్ప‌త‌నం గురించి, తెలంగాణ గురించి ఆయ‌న క‌మిట్ మెంట్ మాజీ రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ రాసిన ద కొలిష‌న్ ఇయర్స్ (సంకీర్ణ సంవ‌త్స‌రాలు) పుస్త‌కంలో వెలిబుచ్చిన అభిప్రాయం ఇప్పుడు దేశ రాజ‌కీయ నాయ‌కుల‌ను ఆక‌ర్షిస్తోంది. ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ కాంగ్రెస్ లో కీల‌క‌నేత‌. ఆయ‌న రాష్ట్ర‌ప‌తి కాక‌ముందు 2004లో టీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తుపెట్టుకుని స‌మైక్య రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలోకి వ‌చ్చాయి. రాష్ట్రంలో, కేంద్రంలో టీఆర్ఎస్ ప్ర‌భుత్వంలో చేరింది. యూపీఏ కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన ఆ స‌మ‌యంలో ప‌ద‌వుల పంప‌కంలో ఎవ‌రికి ఏ మంత్రి ప‌ద‌వి ఇవ్వాలి అన్న విష‌యంలో కొంత సంధిగ్ధ‌త నెల‌కొంది.

మార్పు వెన‌క మ‌త‌ల‌బు ఇదీ

తెలంగాణ తెలుగుదేశం పార్టీలో భ‌విష్య‌త్ లేద‌ని, అధినేత ఆదేశాల మేర‌కు కొత్త జెండా ఎత్తుకుంటున్న టీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోవ‌డం వెన‌క అత‌ని రాజ‌కీయ భ‌విష్య‌త్ ఆలోచ‌న‌లు చాలా ఉన్నాయి. ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌లో తెలంగాణ‌లో తెలుగుదేశం పార్టీని ముందుకు న‌డ‌ప‌డం అసాధ్యం. కాబ‌ట్టి కాంగ్రెస్ పార్టీలో చేరి రాజ‌కీయ భ‌విష్య‌త్ మీద ఆశ‌లు స‌జీవంగా ఉంచుకోవాల‌న్న‌దే రేవంత్ ఆలోచ‌న‌గా తెలుస్తుంది. అస‌లు రేవంత్ రాజ‌కీయ చ‌రిత్ర‌ను ఒక‌సారి ప‌రిశీలిస్తే దీని మీద పూర్తి అవ‌గాహ‌న వ‌స్తుంది. అన్ని పార్టీల అండ‌తో మిడ్జిల్ మండ‌ల జ‌డ్పీటీసీగా గెలిచిన రేవంత్ రెడ్డి మెల్ల‌గా చంద్ర‌బాబుకు చేరువై

సింగ‌రేణి వార‌సత్వ ఉద్యోగాల కోసం ..

ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ మేరకు ఇన్వాలిడేషన్‌ ద్వారా వారసత్వ ఉద్యోగాల కల్పనకు సింగరేణి యాజమాన్యం కసరత్తు మొదలుపెట్టింది. ఈ నెల 30న సింగరేణి బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్ల సమావేశంలో ఇది ఆమోదం పొందే అవకాశం ఉంది. చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ (సీఎంఓ)తో కూడిన వైద్య నిపుణుల బృందంతో మెడికల్‌ బోర్డును ఏర్పాటు చేయనున్నారు. గతంలో మాదిరిగా ఇతర శాఖల అధికారులు మెడికల్‌ బోర్డులో ఉండకుండా చర్యలు తీసుకుంటున్నారు.

కండువా క‌ప్పుకోవ‌డం నిజ‌మే కానీ

తెలంగాణ తెలుగుదేశం పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిక ఖాయం అయింది. ముహూర్తం ఎప్పుడు ? ఎక్క‌డ ? ఎవ‌రి స‌మ‌క్షంలో ? అన్న విష‌యాల‌ను ప‌క్క‌న పెడితే కాంగ్రెస్ కండువా క‌ప్పుకోవ‌డం మాత్ర‌మే మిగిలింది. తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు రేవంత్ కు మీడియా సాక్షిగా ఆహ్వానం ప‌లుకుతుండ‌గా టీడీపీ నేత‌లు కిక్కురుమ‌న‌డం లేదు. చంద్ర‌బాబు వ‌చ్చాక అన్నీ ఆయ‌న‌కే చెబుతా. నేను పార్టీ మార‌డం లేదు. మీడియా ఏదో రాసుకుంటే నేను ఎందుకు స‌మాధానం చెప్పాలి అంటున్న రేవంత్ రెడ్డి ఆల్రెడీ తెర‌వెన‌క పార్టీ మారేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నాడు. అయితే ఆయ‌న

శ‌త‌మానం భ‌వ‌తి

ఆజాంజాహీ మిల్లు మూత‌తో అడుగున ప‌డ్డ ఓరుగ‌ల్లు కార్మికుల శోభ‌కు వెలుగులు దిద్దే కొత్త చ‌రిత్ర‌కు నేడు శ్రీ‌కారం జర‌గ‌బోతుంది. ఉపాధిలేక ఊళ్లు దాటిన నేత‌న్న‌ల‌కు భ‌రోసా క‌ల్పించే కార్య‌క్ర‌మానికి నేడు శంకుస్థాప‌న జ‌ర‌గ‌బోతుంది. బ‌తుకుదెరువులేక భీవండి, సూర‌త్, షోలాపూర్ ల పాలైన కార్మికులు ఈ మ‌హోత్స‌వానికి త‌ర‌లివ‌చ్చి శ‌త‌మానం భ‌వతి అని దీవించ‌నున్నారు. ఆజాంజాహీ మిల్లుతో కోల్పోయిన వెలుగును మెగా టెక్స్ టైల్స్ పార్క్ తో తిరిగి ర‌ప్పించ‌డానికి తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నం మొద‌లుపెడుతుంది. దేశంలోనే అతి పెద్ద వ‌స్త్ర‌న‌గ‌రిలో దాదాపు 11 వేల కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డుల‌కు పారిశ్రామిక‌వేత్త‌లు ముందుకు వ‌స్తున్న‌ట్లు స‌మాచారం. రాబోయే కాలంలో

జ‌న‌సేన నేత జైలుకు

జ‌నంలోకి రాకుండానే జ‌న‌సేన పార్టీ నేత‌లు జైలు బాట ప‌డుతున్న‌ట్లుంది. జ‌న‌సేన‌ పార్టీ అధికార ప్రతినిధి, పవన్ కళ్యాణ్ ఫాన్స్ నాయకుడు కళ్యాణ్ సుంకర అరెస్ట్ అయ్యాడు. హైదరాబాద్ నార్త్ జోన్ పరిధిలో కళ్యాణ్ సుంకర హల్చల్ చేశాడు. ఓఎల్ఎక్స్‌లో ఐ ఫోన్ 7 అమ్ముతానని పెట్టి డమ్మీ ఫోన్ అమ్మిన కళ్యణ్ సుంకరను పోలీసులు అరెస్ట్ చేశారు. డమ్మీ ఫోన్ ఎందుకు అమ్మారని ప్రశ్నించిన వ్యక్తిని కళ్యాణ్ సుంకర ఎయిర్ గన్‌తో బెదరించాడు. కళ్యాణ్ దగ్గర నుంచి పోలీసులు ఫోర్డ్ ఎండీవర్ కార్, ఎయిర్ గన్‌ని స్వాధీనం చేసుకున్నారు. జనసేన తరపున కళ్యాణ్ సుంకర న్యూస్ ప‌లు

నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌

నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. టీఆర్టీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 8792 పోస్టులతో టీఆర్టీ నోటిఫికేషన్‌‌ను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. స్కూల్‌ అసిస్టెంట్ పోస్టులు 1941, పీఈటీ పోస్టులు 416, స్కూల్‌ అసిస్టెంట్‌(ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌) పోస్టులు 9, లాంగ్వేజ్‌ పండిట్ పోస్టులు 1011, ఎస్జీటీ పోస్టులు 5415లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. జిల్లాల వారీగా మొత్తం టీచర్‌ పోస్టులు ఆదిలాబాద్‌ 293, మంచిర్యాల 169, నిర్మల్‌ 226, ఆసిఫాబాద్ జిల్లాలో 894, కరీంనగర్‌ 71, జగిత్యాల 253 పోస్టులు, పెద్దపల్లి 53, సిరిసిల్ల 76, నిజామాబాద్ 158, కామారెడ్డి జిల్లాలో 381, వరంగల్‌ అర్బన్

టూరిజం : ఈ వీడియోలు చూస్తే

తెలంగాణ ప‌ర్యాట‌కానికి మంచిరోజులు వ‌చ్చాయి. స‌మైక్య పాల‌న‌లో మ‌రుగున ప‌డ్డ తెలంగాణ చారిత్ర‌క ప్ర‌దేశాల‌ను, తెలంగాణ జ‌ల‌పాతాల అందాలు తెలంగాణ ప్ర‌భుత్వ ప్రోత్సాహం పుణ్య‌మా అని వెలుగులోకి వ‌స్తున్నాయి. తెలంగాణ ప‌ర్యాట‌కంపై దూలం స‌త్య‌నారాయ‌ణ డ్రోన్ కెమెరాల సాయంతో తీసిన వీడియోలు ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి. ఈ వీడియోలు మీరు చూశారంటే ఓసారి వెళ్లిరాకుండా ఊరుకోరు. చూడండి ఓ సారి .. telangana tourism telangana tourism Posted by Namasthe Telangana on Saturday, October 21, 2017   telangana tourism telangana tourism Posted by Namasthe Telangana on Saturday, October

ముఖ్య‌మంత్రి ఈ రోజు ప‌ర్య‌ట‌న వివ‌రాలు

మధ్యాహ్నం 2.30:బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి హెలికాప్టర్‌లో వరంగల్‌కు పయనం. మధ్యాహ్నం 3.30:వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం శాయంపేట పరిధిలో మెగా టెక్స్‌టైల్ పరిశ్రమ స్థలానికి చేరుకొని.. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు, వరంగల్ ఔటర్‌రింగ్‌రోడ్డు, కాజీపేట రెండో ఆర్వోబీ, మడికొండ ఐటీ పార్కులో ఇంక్యుబేషన్ సెంటర్ రెండో దశ పనులకు శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 3.45:అక్కడ జరిగే బహిరంగసభలో ప్రసంగిస్తారు. సాయంత్రం 4.55:హెలికాప్టర్‌లో హైదరాబాద్ బయలుదేరుతారు. సాయంత్రం 5.55:బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు.