బాబు డైరెక్ష‌న్ .. ల‌గ‌డ‌పాటి స్క్రిప్టు

బాబు డైరెక్ష‌న్ .. ల‌గ‌డ‌పాటి స్క్రిప్టు

ప‌వ‌న్ క‌ళ్యాణ్ నాయ‌క‌త్వంలోని ట్విట్ట‌ర్ పార్టీ జ‌న‌సేనకు రంగులు అద్దే ప‌నిలో రాజ‌కీయాల‌కు రాంరాం చెప్పిన విజ‌య‌వాడ మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ ఉన్న‌ట్లు తెలుస్తుంది. తెలంగాణ వ‌స్తే రాజ‌కీయ స‌న్యాసం చేస్తానంటూ తెలివిగా గ‌త ఎన్నిక‌ల నుండి త‌ప్పుకుని ఈ సారి ఎన్నిక‌ల్లో తిరిగి అడుగుపెట్టేందుకు తెర‌వెన‌క ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. ఈ మ‌ధ్య‌కాలంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొంత ప‌రిణ‌తిగా మాట్లాడ‌డానికి కార‌ణం ల‌గ‌డ‌పాటి స్క్రిప్టే కార‌ణం అని, 2019లో జ‌న‌సేన ఎన్ని సీట్లు గెలుస్తుందో ఓ స‌ర్వే చేసిన ల‌గ‌డ‌పాటి మెల్ల‌గా జ‌న‌సేన‌లోకి మాజీ కాంగ్రెస్ నేత‌ల‌ను తీసుకొచ్చే ప‌నిలో ప‌డ్డాడ‌ని తెలుస్తుంది.

2019 ఎన్నిక‌ల్లో ఆంధ్రాలో తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వ‌చ్చే ప‌రిస్థితులు క‌నిపించ‌డం లేదు. ఇక రాజ‌కీయాల‌కు దూర‌మై వ్యాపారంలో న‌ష్టాలు మూట‌గ‌ట్టుకున్న ల‌గ‌డ‌పాటికి తిరిగి రాజ‌కీయాల్లోకి ఎప్పుడు రావాలా అన్న ఆలోచ‌న‌లో ఉన్నాడు. ఈ నేప‌థ్యంలోనే ఆ మ‌ధ్య బాబుతో మంత‌నాలు సాగించిన ల‌గ‌డ‌పాటి మెల్ల‌గా ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటును ఎలా చీల్చాల‌న్న స్క్రిప్ట్ ర‌చ‌న‌లో ప‌డ్డ‌ట్లు అర్థం అవుతుంది. గ‌త ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ ప్ర‌చారంతో ముఖ్య‌మంత్రి పీఠం ఎక్కిన చంద్ర‌బాబు ఈ సారి ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో పార్టీ పెట్టించి జ‌గ‌న్ ను దెబ్బ‌తీయాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్నాడు.

ఈ నేప‌థ్యంలోనే ప‌వ‌న్ ఎక్కువ‌గా ప్ర‌జ‌ల్లో తిరిగితే ప్ర‌జ‌ల‌కు అత‌ని మీద ఆస‌క్తి త‌గ్గుతుంద‌ని భావించి అప్పుడ‌ప్పుడు మాత్ర‌మే బాబు స్క్రిప్ట్ ప్ర‌కారం జ‌నంలోకి వ‌చ్చి వెళ్లిపోతున్నాడు. 2019 వ‌ర‌కు ప‌వ‌న్ మీద ప్ర‌జ‌ల్లో క్రేజీ త‌గ్గ‌కుండా చేసి అప్పుడు పార్టీ పెట్టించి ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటును చీల్చాల‌ని భావిస్తున్న‌ట్లు తెలుస్తుంది. ఈ మ‌ధ్య ల‌గ‌డ‌పాటి ఈ ప‌నిలోనే బిజీగా ఉన్నాడ‌ని స‌మాచారం. బాబు డైరెక్ష‌న్ మేర‌కు ల‌గ‌డ‌పాటి స్క్రిప్టు సిద్దం చేస్తున్న‌ట్లు అర్థం అవుతుంది.

(Visited 494 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *