రంగు మారిన రెండాకులు

రంగు మారిన రెండాకులు

త‌మిళ‌నాట రాజ‌కీయాల్లో జ‌య‌ల‌లిత మ‌ర‌ణం త‌రువాత ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అనేక నాట‌కీయ ప‌రిణామాల త‌రువాత ప‌న్నీర్ సెల్వం, ప‌ళ‌నిస్వామి వ‌ర్గాలు ఒక్క‌ట‌య్యాయి. తాజాగా అన్నాడీఎంకె పార్టీ గుర్తు రెండాకులు ప‌ళ‌నిస్వామి వ‌ర్గానికి ద‌క్కింది.

అయితే ఉప ముఖ్య‌మంత్రి ప‌న్నీర్ సెల్వం వ‌ర్గం పెడుతున్న పోస్ట‌ర్ల‌లో రెండాకుల గుర్తుకు కాషాయం రంగు అంటుకుంది. జ‌య‌లలిత మ‌ర‌ణం త‌రువాత మోడీ ఆశీస్సుల‌తో ప‌నీర్ సెల్వం ముందుకు వెళ్తున్నాడు. ఇక రాబోయె ఎన్నిక‌ల్లో పూర్తి స్థాయిలో ఈ వ‌ర్గం మోడీతో జ‌త‌క‌ట్టే అవకాశాలు క‌నిపిస్తున్నాయి. ఆకుపచ్చ రంగులో ఉండే రొండాకుల‌కు కాషాయం రంగు రావ‌డం చ‌ర్చ‌కు తెర లేపింది.

(Visited 126 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *