కేసీఆర్ కోర్కె విని అవాక్క‌య్యారు

కేసీఆర్ కోర్కె విని అవాక్క‌య్యారు

కేసీఆర్ అంటే సాధార‌ణ రాజ‌కీయ నాయ‌కుల‌కు భిన్నం. ఆయ‌న ఆలోచ‌న .. ఆచ‌ర‌ణ .. వ్యూహాలు .. ఎత్తుగ‌డ‌లు అన్నీ అనూహ్య‌మే. అందుకే సంకీర్ణ రాజ‌కీయాల‌లో కేంద్రం మెడ‌లు వంచి త‌న 14 ఏండ్ల పోరాటంతో నాలుగు కోట్ల తెలంగాణ ప్ర‌జ‌ల ఆకాంక్ష ప్ర‌త్యేక రాష్ట్రాన్ని సాధించ‌గ‌లిగారు. ఇప్పుడు బంగారు తెలంగాణ నిర్మాణంలోనూ సంక్షేమాన్ని .. అభివృద్దిని స‌మ‌పాళ్ల‌లో రంగ‌రించి మూడేళ్ల‌లోనే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ది వైపు మ‌ళ్లించ‌గ‌లిగారు.

తాజాగా సూర్యాపేట ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన కేసీఆర్ బ‌హిరంగ‌స‌భ‌లో మాట్లాడుతూ గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల‌కు ముందు మాట ఇచ్చిన ప్ర‌కారం సూర్యాపేట‌ను జిల్లాను చేశాన‌ని, ఎమ్మెల్యేగా గెలిపించిన జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డిని మంత్రిని చేశాన‌ని తెలిపారు. అంతే కాకుండా కాళేశ్వ‌రం ప్రాజెక్టుతో న‌ల్ల‌గొండ‌ను స‌స్య‌శ్యామ‌లం చేస్తాన‌ని, రూ.75 కోట్ల‌తో సూర్యాపేట‌ను, 65 కోట్ల‌తో మూసీ న‌దిని ఆధునీక‌రిస్తాన‌ని వ‌రాలు కురిపించారు.

కేసీఆర్ కురిపించిన వ‌రాలు జ‌నాలు త‌డిసి ముద్ద‌వుతుండ‌గానే ఆయ‌న నోటి నుండి కోరిక వెలువ‌డింది. సూర్యాపేట ప్ర‌జ‌లు అనుకున్న‌దానికంటే ఎక్కువ‌నే చేశాను. సూర్యాపేట ప్ర‌జ‌లు నాకో వ‌రం ఇవ్వాల‌ని కోరారు. ఏమిటా అని ఆలోచించేలోపు ప్ర‌జ‌ల‌ను కేసీఆర్ ఆశ్చ‌ర్యానికి గురిచేశారు. సూర్యాపేట ప్ర‌జ‌లు త‌మ త‌మ‌ ఇళ్ల‌లో ఆరు మొక్క‌ల చొప్పున నాటాల‌ని కోరారు. ఈ సారి ఎన్నిక‌ల్లో ఓట్లేయ‌మంటారేమో అని భావించిన ప్ర‌జ‌ల‌కు కేసీఆర్ కోరిక మంత్ర‌ముగ్ధుల‌ను చేసింది. హ‌ర్ష‌ద్వానాల‌తో కేసీఆర్ కోరిక‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు.

(Visited 842 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *