చంద్ర‌బాబుకు వ‌ర్మ‌ టెన్ష‌న్

చంద్ర‌బాబుకు వ‌ర్మ‌ టెన్ష‌న్

న‌టుడు బాల‌కృష్ణ తీస్తున్న ఎన్టీఆర్ బ‌యోపిక్ కు ద‌ర్శ‌కుడిగా అవ‌కాశం ల‌భిస్తుంద‌ని రాంగోపాల్ వ‌ర్మ భావించాడు. ఆ అవ‌కాశం ద‌క్క‌క‌పోవ‌డంతో ప‌ల‌మ‌నేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత రాకేశ్ రెడ్డిని సంప్ర‌దించి ఆ సినిమాకు నిర్మాత‌ను దొరికించుకున్నాడు. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ అన్న పేరుతో సినిమా తీయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. ఈ ప్ర‌క‌ట‌న ఇప్పుడు టీడీపీ వ‌ర్గాల‌లో క‌ల‌క‌లం రేపుతోంది.

వివాదాల‌కు వ‌ర్మ పెట్టింది పేరు. ఇప్పుడు ఈ సినిమాలో ఎన్టీఆర్ చ‌రిత్ర‌ను ఎలా తీస్తాడో అని ఆందోళ‌న చెందుతున్నారు. ఈ నేప‌థ్యంలో టీడీపీ నేత సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి స్పందిస్తూ వ‌ర్మ త‌న సినిమాలో ల‌క్ష్మీపార్వ‌తిని హీరోయిన్ గా పెట్టుకోవాల‌ని, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని నిర్మాత‌గా ప్ర‌క‌టించుకోవాల‌ని ఎద్దేవా చేశారు.

ఈ వ్యాఖ్య‌లే టీడీపీ వ‌ర్గాల‌లో ఉన్న ఆందోళ‌న‌ల‌ను భ‌య‌ట‌పెట్టింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ‌ర్మ వెనక ఉన్నందున ఈ సినిమాలో ఖ‌చ్చితంగా చంద్ర‌బాబు పాత్ర ఎన్టీఆర్ ను మోసం చేసిన‌ట్లుగా ఉంటుంద‌ని, ఎన్టీఆర్ కుటుంబ స‌భ్యులు క‌ష్ట‌కాలంలో ఎన్టీఆర్ ను మోసం చేశార‌న్న విధంగా ఉంటుంద‌ని టీడీపీ భ‌య‌ప‌డుతోంది. ఈ నేప‌థ్యంలోనే వ‌ర్మ మీద ఆరోప‌ణ‌ల‌కు తెర లేపార‌ని స‌మాచారం. మొత్తానికి వ‌ర్మ టీడీపీకి, చంద్ర‌బాబుకు పెద్ద టెన్ష‌న్ పెట్టాడు.

(Visited 280 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *