శ్రీ‌శైలం గేట్లు మ‌రి కాసేప‌ట్లో ..

శ్రీ‌శైలం గేట్లు మ‌రి కాసేప‌ట్లో ..

శ్రీ‌శైలం ప్రాజెక్టు గేట్లు మ‌రి కొద్ది సేప‌ట్లో ఎత్త‌నున్నారు. ఆంధ్రా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పూజ‌లు నిర్వ‌హించి దిగువ‌కు నీళ్లు విడుద‌ల చేయ‌నున్నారు. శ్రీ‌శైలానికి ఎగువ నుండి వ‌ర‌ద ప్ర‌వాహం కొన‌సాగుతుండ‌డం, కేంద్ర జ‌ల వ‌న‌రుల సంఘం శ్రీ‌శైలంలో 883 అడుగుల మేర మాత్ర‌మే నీటిని నిలువ ఉంచాల‌ని ఆదేశించిన నేప‌థ్యంలో ఈ రోజు నీటిని విడుద‌ల చేయ‌నున్నారు.

నిన్న‌టికే 884.40 అడుగులతో 212 టీఎంసీల నీరు ఉంది. జూరాల‌, శ్రీ‌శైలం, హాంద్రీ నుండి 1.47 ల‌క్ష‌ల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వ‌స్తుంది. ఈ నేప‌థ్యంలో ప్రాజెక్టు మూడు గేట్లు ప‌ది అడుగులు ఎత్తి 84 వేల క్యూసెక్కులు కింద‌కు విడుద‌ల చేయ‌నున్నారు.

(Visited 208 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *