క‌ష్ట‌ప‌డ్డ తెలంగాణ .. ఇష్ట‌ప‌డి అభివృద్ది

క‌ష్ట‌ప‌డ్డ తెలంగాణ .. ఇష్ట‌ప‌డి అభివృద్ది

ఎంతో కష్టపడి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నం. తెలంగాణ ప్ర‌జ‌లంద‌రి ఆశీస్సుల‌తో తెలంగాణ వ‌చ్చింది. మ‌న తెలంగాణ వాళ్ల‌కు పాలించ‌డం రాద‌ని హేళ‌న చేశారు. ఇప్పుడు సంక్షేమంలో దేశంలోనే ముందున్న రాష్ట్రం తెలంగాణ‌. చ‌రిత్ర‌లో ఎన్న‌డూ లేనంత‌గా పేద‌ల‌కు ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెట్టాం. 21.7 శాతం వృద్ధితో తెలంగాణ దేశంలోనే ముందంజలో ఉంది. నాకు రాజ‌కీయ జ‌న్మ‌నిచ్చిన సిద్దిపేట‌కు .. నాకు తెలంగాణ‌ను సాధించే బ‌లాన్నిచ్చిన సిద్దిపేట‌కు శిర‌స్సు వంచి న‌మ‌స్క‌రిస్తున్నా అని రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ అన్నారు. సిద్దిపేట‌, సిరిసిల్ల‌లో ఆయ‌న నూత‌న క‌లెక్ట‌రేట్ ల నిర్మాణానికి శంకుస్థాప‌న కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఆయ‌న సిద్దిపేట ఏర్పాటు చేసిన బ‌హిరంగ‌స‌భ‌లో ప్ర‌జ‌లను ఉద్దేశించి ప్ర‌సంగించారు.

సొంత ఆదాయ వనరులను పెంచుకునే విషయంలో 21.7 శాతం వృద్ధితో తెలంగాణ దేశంలోనే ముందంజలో ఉంది. ఇది భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ, కంప్ట్రోలర్‌ ఆడిటర్‌ జనరల్‌ చెప్పిన లెక్క అని కేసీఆర్ అన్నారు. నా ప్రాణమున్నంత వరకు తెలంగాణ అభివృద్ధికి పునరంకితమవుతా. రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రమూ చేయనంత సాహసంతో 10 జిల్లాలను 31 జిల్లాలుగా మార్చుకున్నాం. రూ.1,300 కోట్లు మంజూరు చేసుకొని కొత్త జిల్లాల్లో సమీకృత పాలనాధికారి కార్యాలయాలతో పాటు పోలీసు కార్యాలయాల నిర్మాణాలకు శ్రీకారం చుట్టాం. కొన్ని పాత జిల్లా కేంద్రాల్లోనూ కూలిపోయే స్థితిలో ఉన్న భవనాల స్థానంలో కొత్తవి నిర్మిస్తున్నాం అని కేసీఆర్ వెల్ల‌డించారు. దేశానికే ఆద‌ర్శంగా తెలంగాణ రాష్ట్రాన్ని త‌యారు చేస్తామ‌ని,దేశంలోనే రైతుల‌ను సంఘటితం చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

(Visited 102 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *