ఫేస్ బుక్ ఆగిపోయింది

ఫేస్ బుక్ ఆగిపోయింది

ఫేస్ బుక్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోట్ల మంది వినియోగ‌దారులు దీనిలో ఖాతాదారులు. ఉద‌యం లేచిన‌ప్ప‌టి నుండి రాత్రి ప‌డుకునేవ‌ర‌కు ఫేస్ బుక్ లో క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతుంటారు. అయితే బుధ‌వారం రాత్రి 9.45 గంటల నుండి 10.45 వ‌ర‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఫేస్ బుక్ ఆగిపోయింది. దాంతో పాటు ఇన్ స్టా గ్రామ్ సేవ‌ల‌కు అంత‌రాయం క‌లిగింది.

భార‌త‌దేశంలోని కొన్ని ప్రాంతాల‌తో పాటు అమెరికా, మెక్సికో, మలేషియా, ఇండోనేషియా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలలో సేవ‌లు నిలిచిపోయాయి. ఖాతాలు తెరిచిన వారంద‌రికీ అంత‌రాయానికి చింతిస్తున్నాం అన్న సందేశం క‌నిపించింది. నిపుణులు ఈ స‌మ‌స్య‌ను గంట సేప‌ట్లో ప‌రిష్క‌రించ‌డంతో ఫేస్ బుక్ వినియోగ‌దారులు సంతోషించారు.

(Visited 255 times, 2 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *