శ్రీ‌శైలం ఫుల్

శ్రీ‌శైలం ఫుల్

శ్రీ‌శైలం ప్రాజెక్టు దాదాపు నిండిపోయింది. మ‌రో తొమ్మిది టీఎంసీలు అయితే పూర్తి స్థాయి నీటి మ‌ట్టానికి చేరుకుంటుంది. ఎగువ నుండి ఇన్ ఫ్లో భారీగా వ‌స్తున్న‌ నేప‌థ్యంలో ఈ రోజు గేట్లు ఎత్తే అవ‌కాశం ఉంది. నిన్న రాత్రికి ప్రాజెక్టు ఇన్ ఫ్లో 1.75 ల‌క్ష‌లుగా న‌మోద‌యింది. ఆల్మ‌ట్టి నుండి ఇన్ ఫ్లో త‌క్కువ‌గానే ఉన్నా శ్రీ‌శైలం ఎగువ‌న‌, జూరాల ఎగువ‌న కురిసిన వ‌ర్షాల‌కు నీటి ఉదృతి పెరిగింది.

జూరాల, తుంగభద్ర, హంద్రీనదుల నుంచి భారీగా వరద వచ్చి శ్రీశైలానికి చేరుతోంది. మరోవైపు నాగార్జునసాగర్‌ కింద ముందస్తు రబీకి అవకాశాలు మెరుగుపడ్డాయి. ఆలమట్టి, నారాయణపూర్‌లు పూర్తి స్థాయి నీటిమట్టాలతో ఉన్నాయి. ఆలమట్టిలోకి 25 వేల క్యూసెక్కుల ప్రవాహం ఉండటంతో, ఈ నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ నీటితోపాటు భీమా నుంచి రావడం, స్థానికంగా కురిసిన వర్షాలతో జూరాలకు ఉదయం 50 వేల క్యూసెక్కుల ప్రవాహం ఉండగా సాయంత్రానికి 1.07 లక్షల క్యూసెక్కులకు పెరిగింది. తుంగభద్ర పరివాహక ప్రాంతంలో కురిసిన వర్షాలతో సుంకేశుల నుంచి 67,158 క్యూసెక్కులు, హంద్రీనది నుంచి 34 వేల క్యూసెక్కులు ఇన్ ఫ్లో వ‌స్తుంది. నాగార్జున సాగ‌ర్ ప్ర‌స్తుత నీటిమ‌ట్టం 523 అడుగులు ఉంది. సాగ‌ర్ నిండాలంటే 160 టీఎంసీలు అవ‌సరం.

(Visited 294 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *