కోయిల్ సాగ‌ర్ గేట్లు తెరిచారు

కోయిల్ సాగ‌ర్ గేట్లు తెరిచారు

మహబూబ్‌నగర్ జిల్లాలోని కోయిల్ సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు రావడంతో 11 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయిలో 2009లో నిండింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో వర్షాలు లేక పోవటంతో సరిపడా నీరు చేరలేదు.

ఈ సారి ప్రాజెక్ట్ నిండటంతో రైతులు ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. కోయిల్‌కొండ మండలంలోని బండ్రపలి వాగు ఉధృతంగా ప్రవహించి జలాశయంలోకి నీరు వచ్చి చేరుతున్నది. మొత్తం 13 గేట్లు ఉండగా, 11 గేట్లను రెండు అడుగుల మేర పైకి ఎత్తి 22 వేల క్యూసెక్కుల నీటిని వాగులోకి వదిలుతున్నట్టు ప్రాజెక్టు ఈఈ భూపాల్‌రెడ్డి తెలిపారు.

(Visited 212 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *