న‌న్ను విడిచి కేసీఆర్ వెంట ప‌డ‌తారా

న‌న్ను విడిచి కేసీఆర్ వెంట ప‌డ‌తారా

ముఖ్య‌మంత్రి కేసీఆర్ అనంత‌పురంలో ప‌రిటాల శ్రీ‌రామ్ పెళ్లికి హాజ‌ర‌యిన విష‌యం తెలిసిందే. ఈ సంధ‌ర్భంగా ప‌లువురు ఆంధ్రా నేత‌లు కేసీఆర్ ను క‌లిసి ముచ్చ‌టించారు. సాధార‌ణంగా అతిథి వ‌స్తే, ఎవ‌ర‌యినా పెద్ద‌లు అనుకోకుండా క‌లిస్తే ప‌ల‌క‌రించ‌డం ఆన‌వాయితీ. అయితే ముఖ్య‌మంత్రి కేసీఆర్ వెళ్లే స‌మ‌యంలో ఆంధ్రా టీడీపీ సీనియ‌ర్ నేత ప‌య్యావుల కేశ‌వ్ ఓ ప‌ది నిమిషాలు ముచ్చ‌టించారు.

దీని మీద తెలంగాణ టీడీపీ నేత‌లు ఆంధ్రా ముఖ్య‌మంత్రి, టీడీపీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబునాయుడుకు ఫిర్యాదు చేశార‌ట‌. దీని మీద చంద్ర‌బాబు గుస్సా అయిన‌ట్లు తెలుస్తుంది. నేనే కేసీఆర్ ఎదుర‌యితే రెండు నిమిషాలు మాట్లాడి వెళ్లిపోయా. పయ్యావుల లాంటి సీనియ‌ర్లు అంత సేపు ఎందుకు మాట్లాడారు. తెలంగాణ‌లో మ‌న పార్టీ ఉంది. వారు రాజీనామా చేసి పోతాం అంటున్నారు అని చంద్ర‌బాబు ప‌య్యావుల‌తో అన్న‌ట్లు స‌మాచారం.

వాళ్లేదో ఫిర్యాదు చేశారంటూ చంద్ర‌బాబు ప్ర‌శ్నించ‌డం ఆశ్చ‌ర్యంగా ఉంది. దానిని ఓ సాధార‌ణ సంఘ‌ట‌న‌గా చూడ‌కుండా అన‌వ‌స‌రంగా ఊహించుకుని భ‌య‌ప‌డ‌డం కేసీఆర్ అంటే చంద్ర‌బాబుకు ఉన్న భ‌యం, ఆందోళ‌న‌ను బ‌య‌ట‌పెడుతుంది. అయితే ఆ పెళ్లిలో అంద‌రూ ఆంధ్రా మంత్రులు త‌న‌ను ప‌ట్టించుకోకుండా కేసీఆర్ వెంట ప‌డ్డార‌ని, దానికి ప‌య్యావులను కార‌ణంగా చూపి ఆంధ్రా మంత్రుల‌ను బెదిరిస్తున్నార‌ని తెలుస్తుంది.

(Visited 2,443 times, 3 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *