మాకు నీళ్లు కావాలి

మాకు నీళ్లు కావాలి

రాష్ట్రంలో తాగు, సాగునీటి అవ‌స‌రాల‌ కోసం మొత్తం 103 టీఎంసీల నీరు ఇవ్వాలని తెలంగాణ ప్ర‌భుత్వం కృష్ణా న‌దీ యాజ‌మాన్య బోర్డును కోర‌నుంది. ఈ మేర‌కు నీటి పారుద‌ల శాఖ అధికారులు నివేదిక‌ను సిద్దం చేశారు. నాగార్జున సాగ‌ర్, శ్రీ‌శైలంల నుండి క‌ల్వ‌కుర్తి ఎత్తిపోత‌ల ప‌థ‌కం, మాధవ‌రెడ్డి ఎత్తిపోత‌ల ప‌థ‌కంల ద్వారా ఈ మేర‌కు నీళ్లు ఇవ్వాల‌ని కోర‌నున్నారు.

శ్రీశైలం ప్రాజెక్టు నుండి నాగార్జునసాగర్‌కు కూడా ఇన్‌ఫ్లో మొదలైనందున యాసంగి పంటకు సాగునీటికి ఢోకా ఉండదు. దీంతో నాగార్జునసాగర్ ఎడమ కాల్వ కింద యాసంగి పంటకు సాగునీరు ఇచ్చేందుకు సర్కారు ప్రణాళికలు సిద్ధం చేసింది. సాగర్ ఎడమకాల్వ కింద జోన్-1కు 34.50 టీఎంసీలు, జోన్-2కు 20 టీఎంసీలు కావాలని నీటిపారుదలశాఖ బోర్డుకు ఇండెంట్ సమర్పించే అవకాశముంది. ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు ద్వారా చెరువులు నింపేందుకు 10 టీఎంసీలు ఇవ్వాలని అందులో కోరనున్నారు.

వచ్చే ఏడాది జూలై వరకు తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని.. హైదరాబాద్‌కు, మిషన్ భగీరథకు నిరంతర సరఫరా కోసం ఇబ్బందులు లేకుండా అధికారులు ముందుజాగ్రత్తలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 13.78 టీఎంసీలు, మిషన్ భగీరథకు 14.83 టీఎంసీలు, నల్లగొండ, ఫ్లోరైడ్‌పీడిత గ్రామాల తాగునీటి కోసం మరో 3.89 టీఎంసీలు కావాలని బోర్డుకు ఇచ్చే ఇండెంట్‌లో పేర్కొననున్నారు. మరోవైపు శ్రీశైలం ద్వారా కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 6 టీఎంసీలు కావాలని కోరనున్నట్టు తెలిసింది.

(Visited 237 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *