కోదండ‌రాం గురించి నాలుగు ముక్క‌ల్లో తేల్చేశాడు

కోదండ‌రాం గురించి నాలుగు ముక్క‌ల్లో తేల్చేశాడు

తెలంగాణ ఎవ‌రు తెచ్చారు ? ఉద్య‌మంలో ఎవ‌రి పాత్ర ఏంటి ? కేసీఆర్ గొప్పా ? కోదండ‌రాం గొప్పా ?
సోష‌ల్ మీడియాలో ఓ పోస్ట్ ఇప్పుడు అంద‌రినీ ఆక‌ర్షిస్తోంది. .. అది madeintg.com పాఠ‌కుల కోసం

ముఖ్య‌మంత్రి గారి ప్రెస్ మీట్ పై ఇంకా వాదోప వాదాలు చర్చలు జరుగుతూనే ఉన్నయి వాదోపవాదాలు పక్కన పెడితే వాస్తవాలను ఎవరైనా అంగీరించాల్సిందే !

ఆ వాస్త‌వాలు ఎలా ఉంటయ్ ?
ఏమిటి తెలంగాణ , ఎక్కడినుంచి ఎక్కడికొచ్చినం !?
2001 మలిదశ ఉద్యమం ఎందుకుమోదలయ్యింది !
కేసీఆర్ అనే వ్యక్తి ఒక్కడుగా తెలంగాణా రాష్ట్ర సమితిని ఎందుకు స్థాపించిండు ?
అప్పటికి తనకున్న ఎమ్మెల్యే పదవి కి రాజీనామాని ఆంద్రా పాలకుల మొకంపై అంత ధైర్యంగా ఎలా విసరగలిగిండు ?
ఏమటి ఆయన ధైర్యం !?
జనం తనవెంటే నడుస్తారని ఏమిటి ఈ తెలంగాణ ప్రజలపై ఆయనకు అంత గట్టినమ్మకం?
పలుసార్లు రాజనామ చేసిన ప్రతీచోట మల్లీ మల్లీ ఆయనే తిరిగి గెలిచి ఉండక పోతె ?
తెలంగాణ వాదం బలపడేదా ?
నిలబడేదా ?
పునాదినండి పార్టీని ఉద్యామాన్ని సమాంతరంగా
ఒక్కొక్క ఇటుక పేర్చిన ఘనుడు ఎవ్వరు !?
అయన ఉద్యమ సమయమంతా సాహస వంతమైన
ఎత్తుగడ‌లతో సాగించిన మాట నిజంకాదా !?

ఆయనకు ప్రతీ సారి ప్రతి ఎత్తుగడకు ప్రజలు సహరించిన మాట అబద్దమా !?
సిద్దిపేట నుండి మొదలైన ఎత్తుల చదరంగంలొ కరీంనగర్ పాలమూరుకు విస్తరించింది అన్నింటా విజయాాలు సాధించి దేశానికి తెలంగాణ ఉద్యమం ఆకర్షింప జేసిన విధానం అబద్దమా !?

ప్రజలలో చైతన్యం నింపిన అనేక బారీ బహిరంగ సభలు, సమావేశాలు ఉద్యమ నాయకుని తూటాల్లాంటి మాటలు ఫిరంగులై గర్జించిన నినాదాలు అబద్దమా !?
ఇవన్నీ కేవలం టీఆర్ఎస్ చెసిన పొరాటాలే కాదనగలమా !?

పల్లే బాటలతో గ్రామ గ్రామాన తెలంగాణ వాదాన్ని టీఆర్ఎస్ జండాల్ని పరిచయం చేసిన సమయంలో
మరే ఇతర నాయకుడు పార్టీ సంఘం సహకారం పెద్దగా లేదన్నది నిజంకాదా !?
.కేవలం టీఆర్ఎస్ అదినాయకుడు, నాయకులు, కార్యకర్తలు వీల్ల పుణ్య‌మే 2009 వరకు సజీవంగా వాదం నెట్టుకు రావటం అబద్దమా !?

పైగా రాజశేఖర్ రెడ్డి కబంద అస్థాలు టీఆర్ఎస్ ని చీల్చటానికి విశ్వప్రయత్నం చెసినప్పుడు
ఏ ప్రతినిది ఏ సంఘం ఊసైనా ఉందా అప్పుడు !?

టీఆర్ఎస్ కేసీఆర్ రెండు జయశంకర్ సార్ బావజాల ఎత్తుగడల పుణ్యం కాదనగలరా !?
ఆయన నడిపించిన నావ టీఆర్ఎస్ . ఆయన నమ్మిన ఆ నావకు కెప్టెన్ కేసీఆర్ ఇది తెలియని అమాయకులా మీరు !?

ఇది 2009 తర్వాత చరిత్ర !

కేసీఆర్ దీక్షకు పూనుకున్నప్పుడు
మునుపుటికన్న వెయ్యిరెట్ల మొండితనం ప్రదర్షించింది కరక్ట్ కాదా !?
అప్పటికే కేసీఆర్ ఆయా సమయాలలో పొలిటిక‌ల్ పార్టీలను చక్రబందంలో ఉంచిఉండటం తెలియని అమాయకులా మీరు !?
అఖిలపక్షం మీటింగ్ లో మెజార్టీ పార్టీలు తెలంగాణకు
సపొర్టే అని లేఖలు కూడా ఇచ్చెలా ఒత్తిడి నింపిన ఘనత నీదా కేసీఆర్ దా !?

ప్రకటన వచ్చింది కెసీఆర్ సేఫ్ ఏడున్నవ్ నీవు?

తదనంతరం కుట్రలు
కుతంత్రాలను ఎదుర్కొవటానికి
సబ్బండ వర్గాలు సంఘాలుగా jac లు గా ఏర్పడ్డయ్ !
అందులో ఒకటి పొలిటిక‌ల్ జాక్ అవునా కాదా సారు ?
అప్పటి ప్రతి jac లక్ష్యం తెలంగాణ సాధించ‌డం తెల్వదానీకు !?
అందులో నీ పొలిటిక‌ల్ jac పాత్ర గొప్పదే కాదనం.
ఆ పాత్ర నిర్వాహణ‌ పూర్తి భారం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీల పున్యమే కద సారు !?
అన్ని పార్టీలు jac నుండి వెల్లిపొయినా టీఆర్ఎస్ నిలబడింది ఎందుకంటే దాని లక్ష్యం తెలంగాణ రాష్ట్రం గుర్తుకు లేదా !?
32 జాతీయ పార్టీల ఆఫీసుల‌ చూట్టు తిరిగి తిరిగి తెలంగాణకు అనుకూలంగ లేఖలు తెచ్చిన
ఘనత టీఆర్ఎస్ దా నీదా !?
తెలంగాణ రాష్ట్రం కొసం అమరులైన 90% మంది టీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులే తెల్వనిదా నీకు!?
డిల్లీ మెడలు వంచింది తెరాస నాయకుల లాబియింగ్ పున్యమే జనం ఎరగనిదా విషయం!?
హైద్రాబాద్ రాయల తెలంగాణ పేచీలపై గట్టిగా
ఎదుర్కొన్నది టీఆర్ఎస్ నాయకత్వమే చెప్పాల్నా విప్పి !?

చివరి దశలో బిల్ ఆగకుండా ఆహోరాత్రులు
శ్రమించింది కేసీఆర్ ఒక్కడే .రెండు సభలల్లో బిల్ పాస్ అవ్వగానే ఎగిరింది ఆడింది గెలిచింది టీఆర్ఎస్ జండాలే …… సబ్బండ వర్గాలే

రాష్టం వచ్చిన తొలి ఎన్నికల్లొ గెలిచింది నిలిచింది
తెరాసనే //ప్రజలు నమ్మింది కేసీఆర్ నె //
కొదండరాంగారు jacగా ఉద్యమ పార్టి తెరాసకు మద్దతన్న ఇవ్వవైతివి !?
పైగా వ్యతిరేకంగనే పనిచెస్తివి ?
ఆపినవా విజయాన్ని?
టీఆర్ఎస్ ఉద్యమ నేప‌థ్యం నుండి రాజకీయ పార్టీగా అవతరిస్తున్నఅని చెప్పిమరీ ఎన్నికలకు పొయిన దమ్ము దైర్యం ఉన్న పార్టీ టీఆర్ఎస్ !?
మరి మనుగడలనే ఉండాలనుకునే jac కథేంది?
పార్టీ పెడ్తవా ఆలా పొక్కలు తొడుతునే ఉంటవా !?
తన పుట్టుకకు కారనమైన తల్లి తండ్రి స్థానాన్నే ప్రశ్నిస్తుంది నీవు !
సొంత గూటికే నిప్పుపట్టే పైత్యపు పనులకు నిత్యం చెస్తునే ఉంది నివ్వు !?
ఏమిటీ నీ గొప్పతనం ఎందుకు ఈ దరిద్రం అవసరమా ఈ సమాజానికి ?
సంసారంలో బిడ్డపుడుతే తల్లిదండ్రుల గొప్పతనం ఐతదికాని బిడ్డగొప్పతనం కాదు ప్రొఫెసర్ !?

ఇప్పటికైన మీ స్థాయినెరిగి ఆకాశంవీడి నెలపై నడవండి మీ గుర్తింపు మీకు తప్పక ఉంటుంది ప్రజల దృష్టిలో ………

post by : Lingaswamy Karnati

(Visited 1,227 times, 2 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *