October 9, 2017

టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ ప్రకటన

తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర కార్యవర్గం టీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ కార్యవర్గాన్ని 69 మందితో ఏర్పాటు చేయాలని నిర్ణయించి ఇప్పటికి 67 మందితో కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి పార్టీ అధ్యక్షుడు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ప్రకటించారు. ఇందులో ఒకరు సెక్రెటరీ జనరల్ డా. కె కేశవరావు గారు, 20 మంది ప్రధాన కార్యదర్శులుగాను 33 మంది కార్యదర్శులుగాను, 12 మంది సహాయ కార్యదర్శులుగాను నియమితులయ్యారు. గత మూస పద్ధతికి భిన్నంగా పార్టీ పనితీరును అద్భుతంగా మెరుగుపరచడానికి, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు క్షేత్రస్థాయి పనితీరును క్షుణ్ణంగా పరిశీలించే వెసులుబాటు ఉండాలని భావించి కార్యవర్గంలో 40 మందికి

కోదండ‌రాం గురించి నాలుగు ముక్క‌ల్లో తేల్చేశాడు

తెలంగాణ ఎవ‌రు తెచ్చారు ? ఉద్య‌మంలో ఎవ‌రి పాత్ర ఏంటి ? కేసీఆర్ గొప్పా ? కోదండ‌రాం గొప్పా ? సోష‌ల్ మీడియాలో ఓ పోస్ట్ ఇప్పుడు అంద‌రినీ ఆక‌ర్షిస్తోంది. .. అది madeintg.com పాఠ‌కుల కోసం ముఖ్య‌మంత్రి గారి ప్రెస్ మీట్ పై ఇంకా వాదోప వాదాలు చర్చలు జరుగుతూనే ఉన్నయి వాదోపవాదాలు పక్కన పెడితే వాస్తవాలను ఎవరైనా అంగీరించాల్సిందే ! ఆ వాస్త‌వాలు ఎలా ఉంటయ్ ? ఏమిటి తెలంగాణ , ఎక్కడినుంచి ఎక్కడికొచ్చినం !? 2001 మలిదశ ఉద్యమం ఎందుకుమోదలయ్యింది ! కేసీఆర్ అనే వ్యక్తి ఒక్కడుగా తెలంగాణా రాష్ట్ర సమితిని ఎందుకు స్థాపించిండు

కేసీఆర్ గొప్ప‌త‌నం ఇక్క‌డే బ‌య‌ట‌ప‌డింది

ఎంత సింగ‌రేణి ఎన్నిక‌ల్లో విజ‌యం సాధిస్తే మాత్రం విప‌క్షాల‌ను ఇలా తిడ‌తారా ? తెలంగాణ ఉద్య‌మంలో కోదండ‌రాం కూడా పాల్గొన్నారు ఆయ‌న‌ను లెక్క‌లేకుండా మాట్లాడ‌తారా ? బీజేపీ మ‌ద్ద‌తు లేందే తెలంగాణ వ‌చ్చిందా ? కాంగ్రెస్ ఇవ్వంది తెలంగాణ ఎలా వ‌చ్చింది ? కేసీఆర్ ముఖ్య‌మంత్రి ఎలా అయ్యారు ? టీడీపీ లేఖ ఇవ్వందే తెలంగాణ వ‌చ్చిందా ? తాజాగా కేసీఆర్ ప్రెస్ మీట్ త‌రువాత ఆయా పార్టీలు, కేసీఆర్ వ్య‌తిరేకుల ప్ర‌శ్న‌లు. ఈ ప్ర‌శ్న‌లు పాత‌వే అయినా తాజాగా సింగ‌రేణి ఎన్నిక‌ల నేప‌థ్యంలో మ‌రో సారి తెర మీద‌కు వ‌చ్చాయి. అస‌లు తెలంగాణ ఉద్య‌మాన్ని నిల‌బెట్టింది ..

నిర్మాత బాల‌కృష్ణ‌

ఇప్ప‌టివ‌ర‌కూ హీరోగా చూసిన ప్ర‌ముఖ న‌టుడు బాల‌కృష్ణ ఇక ముందు నిర్మాత‌గా అడుగులు వేయ‌నున్నారు. 102వ చిత్రంలో న‌టిస్తున్న బాల‌కృష్ణ నిర్మాత‌గా ఎన్టీఆర్ జీవిత‌క‌థ‌ను తెర‌కెక్కించ‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ సినిమాకు ద‌ర్శ‌కుడిని వెతుకుతున్నారు. బాల‌కృష్ణ కుమారుడు మోక్ష‌జ్ఞ‌ను ఈ సంస్థ ద్వారానే ప‌రిచ‌యం చేస్తార‌ని తెలుస్తుంది. క‌ళ్యాణ్ రామ్ ఇప్ప‌టికే నిర్మాత‌గా రానిస్తున్నాడు. నంద‌మూరి తార‌క రామారావు ఆర్ట్స్ అనే పేరు క‌ళ్యాణ్ రామ్ వాడుతున్నందున ఇప్పుడు బాల‌కృష్ణ ఏం పేరు పెడ‌తారా అన్న ఆస‌క్తి నెల‌కొంది.

మాకు నీళ్లు కావాలి

రాష్ట్రంలో తాగు, సాగునీటి అవ‌స‌రాల‌ కోసం మొత్తం 103 టీఎంసీల నీరు ఇవ్వాలని తెలంగాణ ప్ర‌భుత్వం కృష్ణా న‌దీ యాజ‌మాన్య బోర్డును కోర‌నుంది. ఈ మేర‌కు నీటి పారుద‌ల శాఖ అధికారులు నివేదిక‌ను సిద్దం చేశారు. నాగార్జున సాగ‌ర్, శ్రీ‌శైలంల నుండి క‌ల్వ‌కుర్తి ఎత్తిపోత‌ల ప‌థ‌కం, మాధవ‌రెడ్డి ఎత్తిపోత‌ల ప‌థ‌కంల ద్వారా ఈ మేర‌కు నీళ్లు ఇవ్వాల‌ని కోర‌నున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుండి నాగార్జునసాగర్‌కు కూడా ఇన్‌ఫ్లో మొదలైనందున యాసంగి పంటకు సాగునీటికి ఢోకా ఉండదు. దీంతో నాగార్జునసాగర్ ఎడమ కాల్వ కింద యాసంగి పంటకు సాగునీరు ఇచ్చేందుకు సర్కారు ప్రణాళికలు సిద్ధం చేసింది. సాగర్ ఎడమకాల్వ కింద

సంద‌ట్లో స‌డేమియా

ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆంధ్రా మంత్రి ప‌రిటాల సునీత కుమారుడి వివాహానికి హాజ‌ర‌య్యారు. దీనికి తెలంగాణ‌లో కేసీఆర్ అంటే ప‌డ‌ని వారు ఎవ‌రి అర్థాలు వారు తీసుకుని సంతృప్తి ప‌డ్డారు. ఈ కార్య‌క్ర‌మానికి ఆంధ్ర‌జ్యోతి ఎండీ రాధాకృష్ణ కూడా హాజ‌ర‌య్యాడు. కేసీఆర్ ప‌క్క‌నే ప‌లుమార్లు కార్య‌క్ర‌మంలో ద‌ర్శ‌నం ఇచ్చారు. ఆ కార్య‌క్ర‌మానికి కేసీఆర్ ఎందుకు వ‌చ్చారు ? అక్క‌డ ఉండి ఈయ‌న ఏం గ‌మ‌నించారు ? అంటూ తాజాగా రాసుకున్న కొత్త‌ప‌లుకులో కూని రాగాలు తీసుకున్నారు. అస‌లు కేసీఆర్ వ‌చ్చింది తెలంగాణ‌లో త‌న‌కు దూరం అయిన రెడ్ల స్థానాన్ని క‌మ్మ‌వారితో భ‌ర్తీ చేసుకునేందుకే ప‌రిటాల కుమారుడి వివాహానికి వచ్చార‌ని రాధాకృష్ణ

కొంప‌ముంచిన అమిత్ షా కొడుకు

బీజేపీ అధ్య‌క్షుడు అమిత్ షా కొడుకు జ‌య్ షా వివాదంలో చిక్కుకున్నాడు. ఆయ‌న కంపెనీ ఆస్తులు బీజేపీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఏకంగా 16 వేల రెట్లు పెరిగాయ‌ని ది వైర్ న్యూస్ పోర్ట‌ల్ ఇచ్చిన క‌థ‌నం క‌ల‌క‌లం రేపుతోంది. తాజా క‌థ‌నంతో బీజేపీ వ‌ర్గాలు అయోమ‌యంలో ప‌డ్డాయి. న‌ష్ట‌నివార‌ణ చ‌ర్య‌ల‌కు దిగింది. ఆ క‌థ‌నంలో వాస్త‌వం లేద‌ని బీజేపీ వ‌ర్గాలు అంటే ఆ మీడియా సంస్థ మీద జ‌య్ షా వంద కోట్ల ప‌రువున‌ష్టం దావా వేశారు. జయ్‌షా, జితేంద్ర షా ఇద్దరు డైరెక్టర్లుగా 2004లో టెంపుల్ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రారంభమైంది. బీజేపీ జాతీయాధ్యక్షుడు

సింగరేణి అంతా కేసీఆర్ ఫోటో పెట్టుకోవాల్సిందే!

సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో తెరాస విజయం… పురస్కరించుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలనాత్మక వరాలను ప్రకటించేశారు. సింగరేణి కార్మికులతో ఆత్మీయంగా సమావేశమైన ముఖ్యమంత్రి వారి కష్టనష్టాలను సాకల్యంగా విని.. ఎంతబాగా స్పందించారంటే.. కార్మికులంతా ఇక ముఖ్యమంత్రి ఫోటోను తమ ఇళ్లలో పెట్టుకోవాల్సిందే అనిపించేంతగా ఆయన వారికి భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి హామీల దెబ్బకు అసలు సింగరేణిలో ఇతర కార్మిక సంఘాల ఊసు లేకుండా పోతుందేమో అనిపించే స్థాయిలో ఆయన చెప్పుకొచ్చారు. వారి క్షేత్ర స్థాయి సమస్యలను చక్కగా ప్రస్తావించారు. కార్మికులు సొంత ఇళ్లు కట్టుకోవడానికి వడ్డీలేకుండా ఇచ్చే రుణాలను పది లక్షలకు పెంచారు. అలాగే అలియాస్ పేర్లను తొలగిస్తాం..