కేసీఆర్ వ‌స్తున్నారు

కేసీఆర్ వ‌స్తున్నారు

ముఖ్య‌మంత్రి కేసీఆర్ జిల్లాల ప‌ర్య‌ట‌న‌కు రంగం సిద్దం అయింది. చాలా రోజుల నుండి ద‌స‌రా త‌రువాత ఆయ‌న జిల్లాల ప‌ర్య‌ట‌న‌కు వ‌స్తున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. ఈ మేర‌కు ఏ జిల్లాలో ఏ రోజు ప‌ర్య‌టించ‌నున్నారో షెడ్యూలు రెఢీ అయింది. నారాయ‌ణ ఖేడ్ నుండి కేసీఆర్ ప‌ర్య‌ట‌న సిద్దం అయింది.

ఈ నెల 9న సంగారెడ్డి జిల్లా నారాయ‌ణ‌ఖేడ్ లో ప‌లు అభివృద్ది కార్య‌క్ర‌మాల‌కు శంకుస్థాప‌న చేయ‌నున్నారు. ఈ నెల 11న సిద్దిపేట‌, సిరిసిల్ల‌, నిర్మ‌ల్ జిల్లా కేంద్రాల‌లో ప‌ర్య‌టించి జిల్లా కార్యాల‌యాల భ‌వ‌న స‌ముదాయాల‌కు శంకుస్థాప‌న చేయ‌నున్నారు. ఈ నెల 12న సూర్యాపేట జిల్లా కేంద్రంలో అభివృద్ది ప‌నుల‌కు శంకుస్థాప‌న చేస్తారు.

ఈ నెల 20న వ‌రంగ‌ల్ లో తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన కాక‌తీయ మెగా టెక్స్ టైల్ పార్క్ కు శంకుస్థాప‌న చేయ‌నున్నారు. దీని కోసం ఇప్ప‌టికే 1200 ఎక‌రాలు సేక‌రించారు. పెట్టుబ‌డులు పెట్టేందుకు కూడా కంపెనీలు సిద్దంగా ఉన్నాయి. అదే రోజు 669 కోట్ల రూపాయ‌ల వ్య‌యంతో నిర్మించ త‌ల‌పెట్టిన వ‌రంగ‌ల్ ఔట‌ర్ రింగ్ రోడ్డుకు శంకుస్థాప‌న చేయ‌నున్నారు. ఈ ప‌ర్య‌ట‌న అనంత‌రం మ‌రోసారి మిగిలిన జిల్లాల ప‌ర్య‌ట‌న దీపావ‌ళి త‌రువాత ఉండొచ్చ‌ని తెలుస్తుంది.

(Visited 201 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *