జ‌మిలి ఎన్నిక‌లు @ 2018

జ‌మిలి ఎన్నిక‌లు @ 2018

దేశం మొత్తం ఒకేసారి శాస‌న‌స‌భ‌, లోక్ స‌భ‌కు జ‌మిలి ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు రంగం సిద్దం అవుతున్న‌ట్లు తెలుస్తుంది. ఇప్ప‌టికే కేంద్రం ఈ మేర‌కు ఏర్పాట్లు చేసేందుకు ఈవీఎంలు, ఇత‌ర అవ‌స‌రాల కోసం 15,400 కోట్లు కేంద్రం అందించింద‌ని, వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి లోక్‌సభతోపాటు అన్ని రాష్ట్రాల‌ శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు సంసిద్ధంగా ఉండగలమని ఎన్నికల సంఘం (ఈసీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది.

జ‌మిలి ఎన్నిక‌ల విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం ఒక నిర్ణ‌యం తీసుకుని చ‌ట్ట‌ప‌ర‌మ‌యిన చేయాల్సి ఉంద‌ని ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించింది. ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు ఏం కావాల‌ని కేంద్రం అడిగిందని, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, ఓటు తనిఖీ యంత్రాల (వీవీపీఏటీ) కొనుగోలుకు నిధులు కోరగా మంజూరు చేసింద‌ని ఎన్నిక‌ల సంఘం తెలిపింది. వచ్చే సెప్టెంబర్ నాటికి 40 లక్షల వీవీపీఏటీ యంత్రాలను సమకూర్చుకోగలమని వెల్ల‌డించింది.

ఒకేసారి ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డం ద్వారా దేశ వ్యాప్తంగా ప్ర‌తిసారి ఎన్నిక‌ల గంద‌ర‌గోళం లేకుండా ఉంటుంద‌ని కేంద్రం భావిస్తుంది. దాంతో పాటు జ‌మిలి ఎన్నిక‌ల‌తో రాజ‌కీయ ల‌బ్ది జ‌రుగుతుంద‌న్న‌ది మోడీ, అమిత్ షా ఆలోచ‌న‌. ఈ నేప‌థ్యంలో జ‌మిలి ఎన్నిక‌ల‌ను తెర‌మీద‌కు తెస్తున్నారు. మ‌రి దేశ‌మంతా ఒకే సారి ఎన్నిక‌ల‌కు ఓటింగ్ యంత్రాలు స‌మ‌కూర్చుకున్నంత తేలిగ్గా ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌ను అందుబాటులోకి తెచ్చుకోగ‌ల‌మా అన్న‌ది ప్ర‌శ్న‌. అంతిమంగా ప్ర‌జ‌ల‌కు మేలు జ‌రుగుతుంది అనుకుంటే దేనిన‌యినా ఆహ్వానించాల్సిందే.

(Visited 236 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *