175 స్థానాలా.. జ‌న‌సేన జెండా ఎత్తింది

175 స్థానాలా.. జ‌న‌సేన జెండా ఎత్తింది

అబ్బే మేం 175 స్థానాల‌లో పోటీ చేయ‌డ‌మా లేదు లేదు .. కొత్త‌గా మా పార్టీ సోష‌ల్ మీడియా విభాగంలో చేరిన ఒక‌త‌ను పొర‌పాటున ట్వీట్ చేశారు. అస‌లు పోటీ చేయాలా వ‌ద్దా అన్న విష‌య‌మే మా పార్టీలో చ‌ర్చ జ‌ర‌గ‌లేదు. ఇక ఎన్ని స్థానాల‌లో పోటీ చేసేది చెబుతామా అని జ‌న‌సేన మీడియా ప్ర‌తినిధులు అంటున్నారు.

జ‌న‌సేన ట్విట్ట‌ర్ ఖాతాలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందంటూ ట్వీట్ వ‌చ్చింది. దీంతో కంగారుప‌డ్డ ఆ పార్టీ ప్ర‌తినిధులు ఈ వివ‌రాలు తెలిపారు. అస‌లే ట్విట్ట‌ర్ పార్టీ అని పేరు ప‌డిన జ‌న‌సేన‌కు ట్విట్ట‌ర్ లో పెట్టిన విష‌యం మీద కూడా క్లారిటీ లేకుండా పోయింది.

(Visited 358 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *