నమ్మలేని నిజాలు

నమ్మలేని నిజాలు

ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆంద్ర‌ప్ర‌దేశ్ లోని అనంత‌పురం జిల్లా ప‌ర్య‌ట‌న నేపథ్యంలో ఉద్య‌మ స‌మ‌యంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌ల గురించి .. తెలంగాణ రాష్ట్ర స‌మితి ప్ర‌స్థానం గురించి సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ తిప్ప‌రాజు ర‌మేష్ బాబు రాసిన ఫేస్ బుక్ పోస్ట్ ఆస‌క్తిక‌రంగా ఉంది .. అది Madeintg.com పాఠ‌కుల‌కోసం

 

“”నమ్మలేని నిజాలు “”;; మరచిపోయారేమోనని గుర్తు చేస్తున్నా “”
“”ప్రాంతాలుగా విడిపోదాం;; అన్నదమ్ముల్లా కలిసుందాం”” TRS
“”పొట్టకూటికోసం ఆంధ్ర నుండి వలస వచ్చినవారి మీద కాదు ఉద్యమం “”
“”కొద్దిమంది ఆంధ్ర దోపిడీదారులు , రాజకీయ దురహంకారులు ,చీడపురుగులు ;;జల , ఉద్యోగ , వ్యాపార , భూ దొంగల మీదే పోరాటం “”
“”తెలంగాణా “”ఆత్మ గౌరవ, స్వయంపాలన పోరాటమే కానీ సామాన్య ఆంధ్ర ప్రజల పై పోరాటం కాదు “” తెలంగాణా రాష్ట్ర సమితి ;;దోచుకుని , దాచుకున్న వాళ్ళమీదే పోరాటం ;తెరాసా “”
ఉద్యమ సమయంలో తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు , తెలంగాణా రాష్ట్ర సమితి ఉపన్యాసాలు ;; ప్రకటనలు “”
2002 లో కేసి ఆర్ గారు “”తెలంగాణా రాష్ట్ర సమితి “” పార్టీ స్థాపించిన తర్వాత ప్రప్రధమంగా దేశంలో జరిగిన భారీ ఎన్నికలు 2004 లోక్ సభ ఎన్నికలు ;; ఆ ఎన్నికల్లో ;;;;
తెలంగాణా లోని 15 లోక్ సభ స్థానాల్లో నల్గొండ , వరంగల్ , హన్మకొండ , ఆదిలాబాద్ , మెదక్ , కరీంనగర్ (6) పోటీచేసి నల్గొండ తప్ప మిగిలిన 5 లోక్ సభ స్థానాల్లో విజయం సాధించారు ;;
మిర్యాలగూడ , ఖమ్మం , పెద్దపల్లి , నిజామాబాదు , సిద్ధిపేట , సికింద్రాబాద్ , హైదరాబాద్ , మహబూబ్ నగర్ , నాగర్ కర్నూల్ (9) స్థానాల్లో పోటీ చెయ్యలేదు ;; పోటీ చెయ్యలేక కాదు ;;
“”తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు సమ్మతమే “” అంటూ కాంగ్రెస్ “”తెలంగాణా రాష్ట్ర సమితి తో పోత్తుకుడుర్చుకోవడంతో””తెలంగాణా రాష్ట్ర సమితి త్యాగం”” చెయ్యాల్సివచ్చింది ;; మరో విషయం ;;;
“”తెలంగాణా వ్యతిరేక “”తెలుగు దేశం పార్టీ కి చెంప దెబ్బ -చెప్పు దెబ్బ “” కొట్టాలనే ఆంధ్ర ప్రాంతం లోని 16 లోక్ సభ స్థానాల్లో “”తెలంగాణా రాష్ట్ర సమితి “” పోటీ చేసింది ;; ఆ దెబ్బతో “”అనంతపూర్ జిల్లాలోని హిందూపూర్ లోక్ సభ స్థానంలో తెలంగాణా రాష్ట్ర సమితి అభ్యర్ధిగా పోటీ చేసిన బి సురేంద్ర కుమార్ 16,907 భారీగా వోట్లు చీల్చడంతో తెలుగు దేశం అభ్యర్ధి ఓడిపోయారు. అలాగే మరికొన్ని స్థానాల్లో తెలుగుదేశం అభ్యర్ధుల వోటమికి TRS పోటీ చేయడమే కారణం ;;

బొబ్బిలి లోక్ సభ స్థానానికి తెలుగు దేశం అభ్యర్ధి కొండపల్లి పైడితల్లి నాయుడు పై పోటీ చేసిన TRS అభ్యర్ధి జి . వెంకటేష్ కి 14,131 వోట్లు పోలయ్యాయి ;;
ఏలూరు లోక్ సభ స్థానానికి TRS అభ్యర్ధిగా పోటీ చేసిన బి యెన్ వి సత్యనారాయణ కి 4, 776 వోట్లు రావడంతో తెలుగుదేశం అభ్యర్ధి వోడిపోయి నా సహచర విద్యార్ధి కావూరి సాంబశివ రావు గెలుపొందారు ;
మచిలీపట్టణం లోక్ సభ స్థానానికి TRS అభ్యర్ధిగా పోటీ చేసిన బి ఎస్ రావు కి 2,426 వోట్లు రావడంతో కాంగ్రెస్ అభ్యర్ధి బాడిగ రామ కృష్ణ తెలుగు దేశం అభ్యర్ధిని వోడించారు;;
విజయవాడ లోక్ సభ స్థానానికి TRS అభ్యర్ధిగా పోటీచేసిన జే . రామచాద్ర రావు కి 1, 268 వోట్లు రావడంతో తెలుగు దేశం అభ్యర్ధి నా మిత్రుడు , ప్రముఖ సినీ నిర్మాత అశ్వనీ దత్ పై లగడపాటి రాజగోపాల్ గెలుపొందారు ;;తెలుగు దేశం వోదిపోయింది ;
తెనాలి లోక్ సభ స్థానానికి TRS అభ్యర్ధిగా పోటీచేసిన తేరా నరసింహా రెడ్డి కి 4,183 వోట్లు పోలయ్యాయి ;; కాంగ్రెస్ అభ్యర్ధి వల్లభనేని బాల శౌరి గెలిచారు ;;తెలుగు దేశం వోడి పోయింది ;
గుంటూరు లోక్ సభ స్థానానికి TRS అభ్యర్ధిగా పోటీ చేసిన గుండి వెంకటేశ్వర్లు కి 5,444 వోట్లు పోలవ్వడంతో తెలుగుదేశం అభ్యర్ధి వోడిపోయి రాయపాటి సాంబశివరావు గెలుపొందారు ;;
బాపట్ల లోక్ సభ స్థానానికి TRS అభ్యర్ధిగా పోటీచేసిన చెల్లమల్ల వెంకట్ రెడ్డి కి 3,753 వోట్లు రావడంతో నందమూరి తారక రామారావు కుమార్తె దగ్గుపాటి పురంధరేశ్వరి తెలుగుదేశం అభ్యర్ధిని వోడించారు ;;
నరసరావు పెట్ లోక్ సభ స్థానానికి TRS అభ్యర్ధిగా పోటీ చేసిన పులిమామిడి నరసింహా రెడ్డి కి 9 , 622 వోట్లు రావడంతో తెలుగుదేశం అభ్యర్ధి పై కాంగ్రెస్ అభ్యర్ధి మేకపాటి రాజమోహన్ రెడ్డి ఘన విజయం సాధించారు ;;
పుణ్యక్షేత్రం తిరుపతి లోక్ సభ స్థానానికి TRS అభ్యర్ధిగా పోటీచేసిన k . ఈశ్వర్ రావు కి 16, 508 వోట్లు రావడంతో తెలుగుదేశం అభ్యర్ధిపై నా చిరకాల మిత్రుడు , కాంగ్రెస్ అభ్యర్ధి డాక్టర్ చింతా మోహన్ విజయం సాధించారు ;;
చిత్తూర్ లోక్ సభ స్థానానికి TRS అభ్యర్ధిగా పోటీచేసిన A. మల్లా రావు కి 10,258 వోట్లు రావడంతో డీకే ఆదికేశవులు గెలుపొందారు ;
రాజంపేట లోక్ సభ స్థానానికి TRS అభ్యర్ధిగా పోటీ చేసిన పి. అశోక్ రావు కి 11,247 వోట్లు రావడంతో కాంగ్రెస్ అభ్యర్ధి సాయి ప్రతాప్ తెలుగు దేశం పై భారీ విజయం సాధించారు ;;
కడప లోక్ సభ స్థానానికి TRS అభ్యర్ధిగా పోటీచేసిన పి . వెంకటేశ్వర రావు కాంగ్రెస్ అభ్యర్ధి వై ఎస్ వివేకానంద రెడ్డి గెలుపుకు దోహదపడ్డారు ;
అనంతపూర్ లోక్ సభ స్థానానికి TRS అభ్యర్ధిగా పోటీచేసిన A. జగన్మోహన్ రావు 4, 419 వోట్లు చీల్చడంతో తెలుగు దేశం అభ్యర్ధి పై కాంగ్రెస్ అభ్యర్ధి అనంత వెంకట రెడ్డి విజయం సాధించారు ;
కర్నూల్ లోక్ సభ స్థానానికి TRS అభ్యర్ధిగా పోటీచేసిన వి . రవీందర్ రావు 2,723 వోట్లు చీల్చడంతో తెలుగుదేశం అభ్యర్ధి వోడిపోయి కాంగ్రెస్ అభ్యర్ధి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి గెలుపొందారు
నంద్యాల లోక్ సభ స్థానానికి TRS అభ్యర్ధిగా పోటీచేసిన ఎస్ . వాసుదేవ ప్రసాద్ కి 2, 682 వోట్లు రావడం తో ప్రముఖ పారిశ్రామికవేత్త ఎస్ .పి. వై . రెడ్డి గెలుపొందారు ;;

తెలంగాణా రాష్ట్రసమితి కి కాంగ్రెస్ తో పొత్తు ఉన్నా కేవలం తెలంగాణా వ్యతిరేక తెలుగుదేశం పార్టీ ని వోదిన్చాలనే “”స్నేహపూర్వక -మర్యాదపూర్వక పోటీ చేసి “” తెలుగుదేశం పార్టీ కి “”చుక్కలు చూపించిన ఘనత , రాజకీయ చాణక్యత”” తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత శ్రీ కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు గారిదే ;;
“”తెలంగాణా ప్రత్యెక రాష్ట్రానికి అనుకూలమే “”అంటూ కేంద్ర ప్రభుత్వానికి “”తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు లేఖ ఇవ్వడంతో ;;; తెలంగాణా ప్రజల్ని కాంగ్రెస్ మోసం చెయ్యడంతో 2009 లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణా రాష్ట్ర సమితి తెలుగు దేశం పార్టీ తో పొత్తు పెట్టుకున్నప్పటికీ “”తెలంగాణ ప్రజలు “” చంద్రబాబు ని , తెలుగు దేశం పార్టీనీ “”విశ్వసించలేదు ;; నమ్మలేదు “”.
2004 నుండి తెలంగాణా ప్రాంత్రం లో లోక్ సభ కి , 54 శాసన సభ ఉప ఎన్నికల్లో “”ఆంధ్ర వోటర్లు “” తెలంగాణా రాష్ట్ర సమితి పార్టీ కి భారీగా వోట్లు వేసి , గ్రేటర్ మునిసిపల్ ఎన్నికల్లో కూడా భారీగా వోట్లు వేసి “”తెలుగు దేశం పార్టీకి “”నరకం “” చూపించారు ;;కావున
తెలంగాణా రాష్ట్ర సమితి ;; తెలంగాణా ప్రజలు “”తెలంగాణా గుంట నక్కల్ని “” తరిమేసారే తప్ప “”సామాన్య ఆంధ్ర ప్రజల్ని “”కాదు ;;

post by : Tipparajuramesh Babu

తిప్పరాజు రమేష్ బాబు;; జర్నలిస్ట్ ;; హైదరాబాద్ ;
తెలంగాణా దత్త పుత్రుడు ;; 02 -10 -2017

(Visited 1,033 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *