రెండేళ్ల‌లో రాత మారుతుంది

రెండేళ్ల‌లో రాత మారుతుంది

తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 40 ల‌క్ష‌ల మంది కురుమ‌, యాద‌వులు ఉన్నారు. కానీ మ‌న రాష్ట్రానికి మాంసం దిగుమ‌తి చేసుకోవాల్సిన దుస్థితి ఏర్ప‌డింది. అందుకే బాగా ఆలోచించి గొర్రెల పంపిణీ ప‌థ‌కం చేప‌ట్టాం. రూ.4500 కోట్ల‌తో ప్ర‌ణాళిక చేప‌ట్టాం. 84 ల‌క్ష‌ల గొర్రెలు రెండేళ్ల‌లో పంపిణీ చేయాల‌ని నిర్ణ‌యించాం అని రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ అన్నారు. రెండేళ్ల‌తో తెలంగాణ గొల్ల‌, కురుమ‌లు కుబేరులు కావాల‌ని ఆయ‌న అభిల‌షించారు. అఖిల భారత కురుమల సమావేశం నిమిత్తం పలు రాష్ట్రాల ప్రతినిధులు వచ్చారు. వారు ప్రగతి భవన్ లో కేసీఆర్ ను కలిశారు.

ఇప్ప‌టి వ‌ర‌కు 23 ల‌క్ష‌ల 80 వేల గొర్రెల‌ను పంపిణీ చేశామ‌ని, రెండేళ్ల‌లో ల‌క్ష్యాన్ని చేరుకుంటామ‌ని కేసీఆర్ ప్ర‌తినిధుల‌కు వివ‌రించారు. గొల్లకురుమల సంఘం వసతి గృహానికి 10 ఎకరాల స్థలం, రూ. పది కోట్ల సాయం కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ‌లో గొల్ల‌, కురుమ‌ల అభ్యున్న‌తి, సంక్షేమానికి ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌ల ప‌ట్ల ప్ర‌తినిధులు ధ‌న్య‌వాదాలు తెలిపారు.

(Visited 294 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *