బ‌ర్గ‌ర్ల కోసం తుపాకీ కాల్పులు

బ‌ర్గ‌ర్ల కోసం తుపాకీ కాల్పులు
తుపాకీ కాల్పులు! ఇప్పుడు ప‌లు దేశాల్లో కామ‌న్ అయిపోయిన విష‌యం.  మ‌త విద్వేషాల‌కు, జాత్యాహంకారాల‌కు తుపాకీని వాడడం అనేక దేశాల్లో ఎక్కువైపోయింది. అయితే, తాజాగా బ్రెజిల్‌లో కూడా తుపాకీ సంస్కృతి పెరిగింది. అయితే, ఈ తుపాకీ కాల్పులు ఏదో అతి పెద్ద నేరానికో.. ఘోరానికో.. జ‌రిగితే.. ఇప్పుడు ఇలా సెన్సేష‌న్ అయ్యేదికాదు. సాధార‌ణ ఘ‌ట‌న‌గానే ఉండేది. కానీ, బ్రెజిల్‌లో జ‌రిగిన తుపాకీ కాల్పులు కేవ‌లం బ‌ర్గ‌ర్ల కోసం!! విన‌డానికి కొంత ఆశ్చ‌ర్యం అనిపించినా.. ఇది నిజం!  బ్రెజిల్‌లోని పారిశ్రామిక/  వాణిజ్య‌ ప‌ట్ట‌ణం రియో డీజెనీరియో అంద‌రికీ తెలిసిందే.
ఇటీవ‌ల ఇక్క‌డ ఒలింపిక్స్ క్రీడ‌లు జ‌రిగాయి. ఇక్క‌డ అనేక మంది ప్ర‌ముఖులు నివాసం కూడా ఉంటారు. అలాంటి ప్రాంతంలో జ‌రిగిన ఓ ఘోరం ఇప్పుడు ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. విష‌యంలోకి వెళ్తే.. స్థానికంగా ఉన్న మెక్‌డొనాల్డ్ రెస్టారెంట్ ఆరుగురు వ్య‌క్తులు వ‌చ్చారు. అప్ప‌టికే రెస్టారెంట్ మూసే స‌మ‌యం అయిపోయింది. అయినా కూడా త‌మ‌కు 40 బ‌ర్గ‌ర్లు కావాల‌ని ఈ ఆరుగురు ఆర్డ‌రిచ్చారు. స్థానిక ధ‌ర‌ల ప్ర‌కారం ఈ బ‌ర్గ‌ర్ ఒక్కొక్క‌టీ 80 రూపాయ‌లు ఉంటుంది. అయితే, వీరు ముందు ఆర్డ‌ర్ ఇవ్వ‌డంతో వేడివేడిగా వాటిని రెడీ చేశారు రెస్టారెంట్ నిర్వాహ‌కులు.
వేడివేడిగా బర్గర్లు తెచ్చాక.. బిల్ చెల్లించాల‌ని మిత్తం 3200 అయింద‌ని  కౌంటర్‌లోని వ్యక్తి అడిగాడు.. అయితే, ఆ ఆరుగురిలో ఒక‌డు .. బిల్లు క‌ట్టేది లేద‌ని వాద‌న‌కు దిగాడు. అంతేకాదు, బ‌ర్గ‌ర్ల‌ను బుట్ట‌లో వేసుకుంటూ..  తన వెంట తెచ్చుకున్న గన్‌తో  అనూహ్యంగా  కాల్పులకు దిగాడు. అతనితో ఉన్న మ‌రో ఐదుగురు కూడా  తుపాకులు బ‌య‌ట‌కు తీశారు. దీంతో ఒక్క‌సారిగా తీవ్ర అల‌జ‌డి రేగింది. అస‌లు ఏం జ‌రుగుతోందో అర్ధం కాని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇక‌, రెస్టారెంట్‌కు వ‌చ్చిన వాళ్లు బ‌య‌ట‌కు ప‌రుగులు తీయ‌గా..  బుల్లెట్లు ఎక్కడ తగులుతాయన్న భయంతో రెస్టారెంట్ సిబ్బంది  టేబుళ్ల కింద.. దాక్కున్నారు.
అయితే, ఈ ఘ‌ట‌న‌లో ఎవ‌రికీ ఎలాంటి ప్ర‌మాదం సంభ‌వించ‌లేదు. కాగా, ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు ..  తుపాకి కాల్పుల పాల్పడ్డవారు.. డ్రగ్స్‌ డీలర్లని గుర్తించారు. ఈ మేర‌కు  సీసీ ఫుటేజ్‌ను స్వాధీనం చేసుకుని వేట సాగిస్తున్నారు.  ఈ ఘ‌ట‌న బ్రెజిల్‌నే కాకుండా ప్ర‌పంచం మొత్తాన్ని ఊపేయ‌డం గ‌మ‌నార్హం. తుపాకీ సంస్కృతిలో ప‌రాకాష్ట‌గా మారిన ఈ ఉదంతంపై నెటిజ‌న్లు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.
(Visited 33 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *