October 2017

కాంగ్రెస్ లో చేరిన రేవంత్

ఇటీవలే టీడీపీకి రాజీనామా చేసిన కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో రేవంత్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రేవంత్‌ను పార్టీకి రాహుల్ సాదరంగా ఆహ్వానించారు. రేవంత్ వెంట ఉత్తమ్‌కుమార్ రెడ్డి, చిన్నారెడ్డితో పాటు ఆయన అనుచరులు ఉన్నారు. రేవంత్ చేరికపై ఏఐసీసీ కార్యాలయం నుంచి ముఖ్యనేతలు మధ్యాహ్నం 3 గంటలకు అధికారికంగా ప్రకటించనున్నారు. రేవంత్ తో పాటు వేం నరేందర్ రెడ్డి, సీతక్క, విజయరమణారావు, బోడ జనార్ధన్, మేడిపల్లి సత్యం, అరికెల నర్సారెడ్డి కాంగ్రెస్ లో చేరారు.

ఏం చేయ‌బోతున్నాం.. గుట్టువిప్పిన రేవంత్

తెలంగాణ‌లో భ‌విష్య‌త్ లో ఏం జ‌ర‌గ‌బోతుంది ? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు విఫ‌ల‌య‌త్నాలు చేసిన ఆంధ్రా పెట్టుబ‌డిదారి వ‌ర్గాలు, కేసీఆర్ వ్య‌తిరేక వ‌ర్గాలు ఇక ముందు ఏం చేయ‌బోతున్నాయి ? తెలంగాణ‌లో తెలుగుదేశం పార్టీని చంద్ర‌బాబు నాయుడు ఎందుకొర‌కు భూస్థాపితం చేయ‌బోతున్నాడు ? అస‌లు ఆంధ్రా తెలంగాణ రాజ‌కీయాల‌లో 2019లో ఏం జ‌ర‌గ‌నుంది వంటి అనుమానాల‌కు టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేర‌బోతున్న రేవంత్ రెడ్డి స‌మాధానాలు చెప్పాడు. కాంగ్రెస్ నాయ‌కుల ఆత్మీయ వేదిక మీద చంద్ర‌బాబునాయుడిని మెచ్చుకుంటూ, ఆంధ్రా అభివృద్దిని ఆకాశానికి ఎత్తుతూ తెలంగాణ మీద లేని ప్రేమ‌ను ప్ర‌క‌టించి తామంద‌రి వ్యూహం ఏంటి అన్న

విమర్శకుల నోళ్లకు తాళం!

విమర్శకుల నోళ్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ తాళం వేశారు. కొత్త ప్రభుత్వం కొత్త రాష్ట్రం పాలన సాగుతోంటే.. ఊపిరి సలపనివ్వకుండా ఏదో ప్రజా ద్రోహం జరిగిపోతున్నట్లుగా నానా మాటలూ అంటూ వచ్చిన ప్రతిపక్షాలకు అసెంబ్లీ సాక్షిగా ఒకే ఒక్క ప్రకటనతో జవాబు చెప్పేశారు. తెలంగాణ యువతరానికి వరాన్ని ప్రకటించారు. యూత్ కు లక్ష ఉద్యోగాలు ఇస్తాం అనే.. తన ప్రకటనకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నదనే నిర్ధరించారు. కేవలం లక్ష ఉద్యోగాలు మాత్రమే కాదు.. లక్ష కంటే ఎక్కువే ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం అంటూ శాసనసభలోముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన.. ఆయనను విమర్శించే వారి నోళ్లకు తాళాలు వేయగలదంటే ఎలాంటి ఆశ్చర్యం లేదు.

ఆట‌..మాట‌ల మ‌ధ్య ``ఏమి సేతురా`` పాట

సినిమాకు క్లాప్ కొట్టినప్పటినుంచీ.. విడుద‌ల చేసే వ‌ర‌కూ ప్ర‌తీ సంద‌ర్భమూ ప్ర‌మోష‌న్‌కు ఉప‌యోగించుకోద‌గ్గ‌దే. పోస్ట‌ర్‌, టీజ‌ర్‌, ఆడియో రిలీజ్ ఫంక్ష‌న్ల‌ను ఒక రేంజ్‌లో చేస్తారు. సినిమా ప్ర‌చారం వినూత్న పంథాలో సాగుతున్న నేటికాలంలో ప్ర‌మోష‌న్స్ కోసం ఎన్నోకార్య‌క్ర‌మాలు, వ్య‌య‌ప్ర‌యాస‌లు త‌ప్ప‌వు.  ఈ ట్రెండ్‌కు భిన్నంగా బిగ్‌బాస్ ఫ‌స్ట్ సీజ‌న్ విన్న‌ర్ శివ‌బాలాజీ తాను హీరోగా న‌టించిన సినిమా “ స్నేహ‌మేరా జీవితం“ ఆడియో విడుద‌ల‌ను వినూత్నంగా, అతిసామాన్యంగా చేస్తున్నారు. ఒక్కో పాట విడుద‌ల‌కు ఒక్కో ప్ర‌త్యేక‌ సంద‌ర్భాన్ని, ప్ర‌త్యేక‌త‌ను జోడిస్తూ..న‌యా ట్రెండ్ సెట్ చేస్తున్నారు. బిగ్‌బాస్ ఫినాలే త‌రువాత ఎక్క‌డ చూసినా శివ‌బాలాజీ టాపిక్కే! హీరోగా ఎన్నో హిట్

అందుకే... కేసీఆర్ కు తిరుగులేదు!

రాజకీయ పార్టీల కార్యకర్తలు అంటే జెండాలు మోసే వాళ్లుగా మాత్రమే ప్రపంచానికి తెలుసు. పార్టీల మీది అభిమానంతో తమ సమయాన్ని ధనాన్ని వృథా చేసుకుని పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ జేజేలు కొడుతూ.. జెండాలు మోస్తూ విజయానికి పనిచేసేవాళ్లు కార్యకర్తలు. వీరు పార్టీని అధికారంలోకి తెస్తుంటారే తప్ప, వారికి పార్టీలు ఏమీ చేసే దాఖలాలు గతంలో లేవు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. కార్యకర్తలను కూడా దేవుళ్ల మాదిరిగా పార్టీలు నెత్తిన పెట్టుకుంటున్నాయి. వారి సంక్షేమం తమ ప్రథమ బాధ్యతగా పార్టీలు గుర్తిస్తున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయంలో తనకు తిరుగులేదని మరోసారి నిరూపించుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఏకంగా

క‌ల్లోల కాంగ్రెస్ .. క‌ల‌హాల టీడీపీ

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు 60 ఏళ్లు రాష్ట్రాన్ని ఏలిన తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల‌ భ‌విష్య‌త్ తెలంగాణ రాష్ట్రంలో అగ‌మ్య‌గోచ‌రంగా మారింది. కేవ‌లం ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త మీద ఆధార‌ప‌డి గాలివాటం గెలుపుల‌కు అల‌వాటుప‌డిన రెండు పార్టీల‌కు ఇప్పుడు ఎలాంటి ప్ర‌ణాళిక లేక, న‌డిపించే నాయ‌కులు లేక ఆందోళ‌న‌లో ఉన్నారు. అధికారం అంటే కేవ‌లం త‌మ ఆధిప‌త్యం నిరూపించుకోవ‌డానికి, ఆస్తులు కూడ‌బెట్టుకోవ‌డానికి అని ఇన్నేళ్లు రాజ‌కీయాలు చేసిన నేత‌ల‌కు ఇప్పుడు గ‌త మూడేండ్లుగా తెలంగాణ‌లో జ‌రుగుతున్న అభివృధ్ది చూసి ఎటూ తేల్చుకోలేక పోతున్నారు. స‌మైక్య రాష్ట్రంలో సీమాంధ్ర పాల‌కుల ద‌యాదాక్షిణ్యాల మీద ఆధార‌ప‌డి రాజ‌కీయ మ‌నుగ‌డ సాగించిన ఈ నేత‌లు

బాబు సిగ్న‌ల్ .. టీడీపీలో లొల్లి షురూ

తెలంగాణ తెలుగుదేశం పార్టీలో లొల్లి మొద‌ల‌యింది. రేవంత్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌తో మొద‌ల‌యిన క‌ల‌క‌లం ఇప్పుడు రేవంత్ అధికారాలు తొల‌గించే వ‌ర‌కు వ‌చ్చింది. లండ‌న్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న చంద్ర‌బాబు నాయుడు పార్టీ తెలంగాణ అధ్య‌క్షుడు ఎల్.ర‌మ‌ణ‌కు పూర్తి అధికారాలు ఇచ్చాడ‌ని, రేవంత్ నిర్వ‌హించే స‌మావేశాల‌తో పార్టీకి సంబంధం లేద‌ని తెలుస్తుంది. శాస‌న‌స‌భ స‌మావేశాల నేప‌థ్యంలో ఈ రోజు టీడీఎల్పీ కార్యాల‌యంలో స‌మావేశానికి రేవంత్ ఎమ్మెల్యేల‌ను ఆహ్వానించాడు. అయితే అదే స‌మ‌యంలో టీడీపీ – బీజేపీ నేత‌ల‌తో గోల్కొండ హోట‌ల్ లో స‌మావేశం నిర్వ‌హిస్తూ ఎల్.ర‌మ‌ణ ఆహ్వానం పంపించాడు. అయితే శాసనసభా వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అధికారం ఎవరికీ లేదని, ఎల్