కోదండ‌రాం .. కోమ‌టిరెడ్లు క‌లిసి

కోదండ‌రాం .. కోమ‌టిరెడ్లు క‌లిసి

కాంగ్రెస్ పార్టీలో ఆద‌ర‌ణ లేక .. అందులోనుండి బ‌య‌ట‌ప‌డ‌లేక ఆందోళ‌న‌లో ఉన్న కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి సోద‌రులు ఇక ప్ర‌త్యామ్నాయం మీద దృష్టి సారించార‌ని తెలుస్తుంది. త‌మ‌కు అవ‌కాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఖ‌ర్చంతా భ‌రిస్తామ‌ని అంటూ అధిష్టానానికి ఎన్ని సార్లు నివేదించినా ప‌ట్టించుకోక‌పోవ‌డంతో కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ ఆగ్ర‌హంగా ఉన్నారు. అయితే కాంగ్రెస్ ను వీడ‌డం మూలంగా త‌మ‌కు ఇబ్బందులు వ‌స్తాయి .. అందులో అధికార టీఆర్ఎస్ పార్టీ త‌మ‌ను ఆద‌రించే ప‌రిస్థితి లేదు. అందుకే రెంటికి చెడ్డ రేవ‌డిలా కాకుండా తెర‌వెన‌క మంత‌నాల‌కు తెర‌లేపార‌ని స‌మాచారం.

ఇప్ప‌టికే రెండు మూడు సార్లు కోదండ‌రాంతో ఈ సోద‌రులు చ‌ర్చ‌లు జ‌రిపార‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల‌కు వ‌ర‌కు ఎలాంటి వ్యూహాలు అనుస‌రించాలి .. ఏ విధంగా ముందుకు వెళ్లాల‌ని అనుకున్నార‌ని తెలుస్తుంది. ఇక బీజేపీ అధిష్టానం ముందు కూడా రాష్ట్ర ప‌గ్గాలు మాకు ఇస్తే పార్టీలో చేర‌తాం అని అడిగార‌ని, ఆ పార్టీలో ఆ సాంప్ర‌దాయం లేక‌పోవ‌డంతో అందులోకి వెళ్తే కూర‌లో క‌రివేపాకులం అవ‌తామ‌ని వెన‌క్కు తగ్గిన‌ట్లు చెబుతున్నారు. అటు ఇటు తిరిగి ఎన్నిక‌ల నాటికి కోదండ‌రాం తో క‌లిసి వెళ్లే ఆలోచ‌న‌లు ఉన్న‌ట్లు స‌మాచారం. కోదండ‌రాం యాత్ర‌ల‌కు జ‌నాద‌ర‌ణ లేక ఓ వైపు ఆందోళ‌న‌లో ఉన్నాడు. కాంగ్రెస్ లో త‌మ వెంట న‌డిచే నాయ‌కులు లేక కోమ‌టిరెడ్డి సోద‌రులు ఆవేద‌న‌లో ఉన్నారు. ఇద్ద‌రూ క‌ల‌సి చేసేదేంటో వేచిచూడాలి.

(Visited 394 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *