డిసెంబ‌రులో ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌లు

డిసెంబ‌రులో ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌లు

డిసెంబర్ 15 నుంచి 19 వరకు ఐదు రోజుల పాటు ప్రపంచ తెలుగు మహాసభలు హైద‌రాబాద్ లో నిర్వహించాలని ముఖ్యమంత్రి కెసీఆర్ నిర్ణయించారు. అక్టోబర్ నెలలోనే ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించాలని ప్రభుత్వం మొదట నిర్ణయించింది. అయితే అక్టోబర్ 5 నుంచి 9వరకు దాదాపు 90 దేశాల ప్రతినిధులు పాల్గొనే ప్రపంచ టూరిజం సదస్సు హైదరాబాద్‌లోనే జరుగుతున్నది. నవంబర్ 28 నుంచి దాదాపు 170 దేశాలు పాల్గొనే ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సుకు కూడా హైదరాబాద్ వేదిక అయింది.

ఈ రెండు కార్యక్రమాల్లో అధికార యంత్రాంగమంతా బిజీగా ఉంటుంది. అదే సమయంలో ప్రపంచ తెలుగు మహాసభలు జరిపితే, అనుకున్నంత ఘనంగా నిర్వహించలేమని ప్రభుత్వం భావించింది. కాబట్టి ఆ రెండు ప్రపంచ సదస్సులు ముగిసిన తర్వాత డిసెంబర్‌లో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణ‌యించారు. ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణకు సాహిత్య అకాడమీ నోడల్ ఏజన్సీగా పనిచేస్తుంది.

(Visited 17 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *