ఎందుకో ఈ అస‌హ‌నం ?

ఎందుకో ఈ అస‌హ‌నం ?

‘తెలంగాణ రాష్ట్ర అవ‌త‌ర‌ణ‌తో జేఏసీ బాధ్య‌త తీరిపోలేదు. ఇక నుండి ప్ర‌జ‌ల ప‌క్షాన నిల‌బ‌డి ప్ర‌భుత్వంతో క‌లిసి ప‌నిచేస్తాం. తెలంగాణ ఏర్పాటుతోనే జేఏసీ ప‌ని పూర్తి కాలేదు. తెలంగాణ అభివృద్దిలోనూ జేఏసీ ఉంటుంది. వ‌చ్చిన తెలంగాణ ప్ర‌జ‌ల క‌ల‌లు నెర‌వేర్చే తెలంగాణ కావాలి’

తెలంగాణ ఆవిర్భావం, టీఆర్ఎస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన తొలినాళ్ల‌లో తెలంగాణ జేఏసీ చైర్మ‌న్ కోదండ‌రాం ప‌లుకులు ఇవి. కొన్నాళ్లు భాగానే ఉన్నారు. ప్ర‌భుత్వ ప‌నితీరును మెచ్చుకున్నారు. అమెరికా వెళ్లి వ‌చ్చారో లేదో కోదండ‌రాం వైఖ‌రి పూర్తిగా మారిపోయింది. తెలంగాణ ప్ర‌భుత్వం ఏ కార్య‌క్ర‌మం చేప‌ట్టినా దాని మీద గుడ్డి ఆరోప‌ణ‌లు చేయ‌డం మొద‌లు పెట్టారు. ఆ త‌రువాత ఓ అడుగు ముందుకేసి తెలంగాణ ఉద్య‌మంలో ఎన్న‌డూ క‌లిసిరాని సీపీఎం, టీడీపీ, కాంగ్రెస్ పార్టీల వేదిక‌లు పంచుకోవ‌డం మొద‌లుపెట్టారు.

60 ఏండ్లు న‌ష్ట‌పోయిన తెలంగాణ ప్రాంతాన్ని గోదావ‌రి, కృష్ణ‌మ్మ నీళ్ల‌తో త‌డిపి స‌స్య‌శ్యామలం చేద్దామ‌ని ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నాలు మొద‌లు పెడితే వంద‌ల‌కొద్దీ కేసుల‌తో అడుగడుగునా ప్రాజెక్టుల‌ను అడ్డుకునే కుట్ర‌లు. ఇవ‌న్నీ ఒక ఎత్త‌యితే తెలంగాణ‌లో పెట్టుబ‌డుల‌కు డ‌బ్బులు లేక ఇబ్బందులు ప‌డుతున్న రైతులు ఇక ముందు బాధ‌ప‌డ‌కుండా తెలంగాణ ప్ర‌భుత్వం రైతు స‌మ‌న్వ‌య స‌మితిలు ఏర్పాటు చేసి ప్ర‌తి రైతుకు ఏడాదికి ఎక‌రాకు ఎనిమిది వేల రూపాయ‌లు ఇద్దామ‌ని ప్ర‌య‌త్నాలు చేస్తుంటే దాని కోసం విడుద‌ల చేసిన జీఓ 39 ర‌ద్దు చేయాల‌ని హైకోర్టు కెక్క‌డం జేఏసీ, విప‌క్షాల కుటిల‌నీతికి ప‌రాకాష్ట.

అస‌లు ప్ర‌భుత్వం రైతుల‌కు ఏం చేస్తుంది ? దాని మూలంగా ఏం జ‌ర‌గ‌బోతుంది తెలియ‌క‌ముందే అవినీతి ఆరోప‌ణ‌లు అంట‌గ‌డ్డ‌డంపై హైకోర్టు పిటీష‌న్ దారుల‌ను త‌లంటిన తీరే విప‌క్షాల అస‌హ‌నం, తెలంగాణ ప్ర‌భుత్వం మీద పెరుగుతున్న అక్క‌సుకు నిదర్శ‌నం. గ‌త ప్ర‌భుత్వాల హ‌యాంలో ఇన్నేండ్ల పాల‌న‌లో ప్ర‌జ‌లను ఓట్ల యంత్రాలుగా వాడుకొని వ‌దిలేయ‌డం త‌ప్ప వారి శాశ్వ‌త ప్ర‌యోజ‌నాల గురించి ఆలోచించిన దాఖ‌లాలు లేవు.

తెలంగాణ ప్ర‌భుత్వం ఒక వైపు పాత‌ సంక్షేమ ప‌థ‌కాలు కొన‌సాగిస్తూనే, కొత్త సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తూనే ప్ర‌జ‌లు త‌మ కాళ్ల మీద తాము నిల‌బ‌డే నూత‌న ప‌థ‌కాల‌కు శ్రీ‌కారం చుట్టింది. ఫించ‌న్లు, ఫీజు రీ ఎంబ‌ర్స్ మెంట్, ఆరోగ్య‌శ్రీ‌ వంటి ప‌థ‌కాలు కొన‌సాగిస్తూనే క‌ళ్యాణ‌ల‌క్ష్మి, విద్యార్థుల‌కు స‌న్న బియ్యం అన్నం, గురుకుల పాఠ‌శాల‌ల ఏర్పాటు, మిష‌న్ కాక‌తీయ‌, మిష‌న్ భ‌గీర‌థ, నూత‌న ప్రాజెక్టులు వంటి కొత్త ప‌థ‌కాల‌కు శ్రీ‌కారం చుట్టింది. గొల్ల‌. కురుమ‌ల‌కు గొర్రెల ప‌థ‌కం, మ‌త్య్స‌కారుల‌కు ఉచితంగా చేప పిల్ల‌లు వంటి ప‌థ‌కాల‌తో గ్రామీణ ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో పెనుమార్పుల‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ పెనుమార్పుకు కార‌ణం అవుతున్నారు.

వీటికి తోడు స‌మ‌గ్ర భూస‌ర్వేతో రైతుల‌కు ఎక‌రాకు ఎనిమిది వేల రూపాయ‌లు ఏడాదికి పంట‌ల సాగుకు పెట్టుబ‌డులు అందిస్తే కేసీఆర్ గ్రాఫ్ సెన్సెక్స్ లా పెరిగిపోతుంది. ఈ ప‌రిణామాలే ఇప్పుడు విప‌క్షాల‌కు మింగుడు ప‌డ‌డం లేదు. అందుకే తెలంగాణ జేఏసీ చైర్మ‌న్ కోదండ‌రాం ను ముందు పెట్టి అడ్డు పుల్ల‌లు వేస్తున్నారు. టీడీపీ, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, బీజేపీలు సిద్దాంతాల‌ను ప‌క్క‌న‌పెట్టి క‌దులుతున్న త‌మ రాజ‌కీయ పునాదుల‌ను ఎలా నిలుపుకోవాలా అని ప్ర‌భుత్వ ప‌థ‌కాలు ప్ర‌జ‌ల ద‌రి చేర‌కుండా కోర్టుల చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేస్తున్నాయి. ప్ర‌తి ప‌నికి అడ్డుత‌గులుతున్న ప్ర‌తిప‌క్షాల దోర‌ణి ప్ర‌జ‌ల‌కు అర్దం అవుతుండ‌డంతో ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు ల‌భించ‌క‌పోవ‌డంతో అస‌హ‌నంతో కేసీఆర్ మీద‌, ప్ర‌భుత్వం మీద ఆధారాలు లేని ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌కు విరుద్దంగా వెళ్లిన ఏ రాజ‌కీయ పార్టీ మ‌నుగ‌డ సాగించిన దాఖ‌లాలు లేవు. విప‌క్షాల తీరు మార‌కుంటే భవిష్య‌త్ లో రాజ‌కీయాల్లో క‌నుమ‌రుగు కావ‌డం ఖాయం.

(Visited 559 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *