కోర్టు నుండి తెలంగాణ ప్ర‌భుత్వాన్ని న‌డ‌ప‌లేం

కోర్టు నుండి తెలంగాణ ప్ర‌భుత్వాన్ని న‌డ‌ప‌లేం

మీకు న‌చ్చ‌ని అంశాల మీద కోర్టుకు వ‌స్తే మేము జోక్యం చేసుకోలేం. మీకు న‌చ్చిన‌వి వేరొక‌రికి ఇష్టం ఉండ‌క‌పోవ‌చ్చు. మీకు న‌చ్చ‌నవి వేరొక‌రికి న‌చ్చొచ్చు. దీనిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని జీవోలను ర‌ద్దు చేయ‌లేం .. న్యాయ‌స్థానాల నుండి తెలంగాణ ప్ర‌భుత్వాన్ని న‌డ‌ప‌లేం అని తెలంగాణ‌లోని విప‌క్షాల‌కు చెంప‌పెట్టులాంటి ప్ర‌శ్న హైకోర్టు వేసింది. రైతు స‌మ‌న్వ‌య స‌మితి పేరుతో ప్ర‌భుత్వం ఏర్పాటు చేస్తున్న రైతు సంఘాల కోసం విడుద‌ల చేసి జీవో 39ని నిలిపివేయాల‌ని ప్ర‌తిప‌క్షాలు, తెలంగాణ జేఏసీ త‌ర‌పున రంగారెడ్డి జిల్లాకు చెందిన చింపుల సత్యనారాయణరెడ్డి, నిజామాబాద్ జిల్లా మనోహర్‌రెడ్డి హైకోర్టులో వేర్వేరుగా వ్యాజ్యాలు దాఖలుచేశారు. దీనిని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ ఉమాదేవి ధర్మాసనం విచారించింది.

తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రైతుకు సబ్సిడీ ఇస్తామని ప్రభుత్వం చెప్తుంటే సమస్య ఏమిటని పిటిషనర్ల తరఫు న్యాయవాదులను ధ‌ర్మాస‌నం నిలదీసింది. జీవో అమలుతో పొరపాట్లు, అక్రమాలకు ఎలా ఆస్కారం ఉంటుందో తెలియజేయకుండా.. జీవోను రద్దుచేయాలని అభ్యర్థించడం ఏమిటని పిటిషనర్లను ప్రశ్నించింది.

రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీగా ప్రతి ఎకరాకు రూ.4 వేలు ఇస్తామని తెలంగాణ రాష్ట్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదని ఒకరు, ఎకరాకు రూ.10 వేలు ఇవ్వాలని మరొకరు, పారిశ్రామికవేత్తలకు ఎందుకు సబ్సిడీ ఇవ్వరని ఇంకొకరు ఇలా వ్యాజ్యాలు దాఖలు చేసుకుంటూపోతే ఎలా? అని పిటిషనర్లను కోర్టు ప్రశ్నించింది. న్యాయస్థానాల్లో కూర్చొని తెలంగాణ ప్రభుత్వాన్ని నడుపలేమని అని ధ‌ర్మాస‌నం అభిప్రాయ‌ప‌డింది. చ‌ట్ట‌విరుద్ద అంశాలుంటే న్యాయ‌స్థానాలు జోక్యం చేసుకుంటాయ‌ని అన్నారు.

(Visited 677 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *