మ‌హాన‌ది .. గోదావ‌రి త‌రువాత‌నే

మ‌హాన‌ది .. గోదావ‌రి త‌రువాత‌నే

నదుల అనుసంధానంలో భాగంగా ముందు గా మహానదిగోదావరిలను కలపాలి. ఆ త‌రువాత‌నే మిగిలిన వాటి గురించి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కేంద్రప్రభుత్వానికి రాష్ట్ర నీటి పారుదల శాఖమంత్రి హరీశ్ రావు సూచించారు. ఢిల్లీలో జరిగిన 31 వ జాతీయ జల అభివృద్ధి సంస్థ (నేషనల్ వాటర్ డెవలప్‌మెంట్ ఏజెనీ) సమావేశంలో ఆయ‌న పాల్గొన్నారు. మ‌హాన‌ది గోదావ‌రి అనుసంధానం మీద ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో కేంద్ర ప్రభుత్వం చర్చించి ఒప్పించాల‌ని కేంద్రాన్ని కోరిన‌ట్లు హ‌రీష్ రావు తెలిపారు.

ఒకే రాష్ట్రంలోని ఒక చోటు నుంచి నీటిని మరొక చోటుకి తీసుకువెళ్లేలా కేంద్ర ప్రభుత్వం సహకరించాలని విజ్ఞప్తి చేశామని , కృష్ణా నది పరీవాహ ప్రాంతమైన శ్రీశైలం, నాగార్జున సాగర్‌లో నీళ్లు రాని పరిస్థితి ఉంటే, గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయని ఈ విషయాన్ని సమావేశంలో అందరి దృష్టికి తీసుకెళ్లామని హ‌రీష్ రావు అన్నారు. మిషన్ కాకతీయ, పెద్ద ఎత్తున నీటి పారుదల ప్రాజెక్టుల అభివృద్ధికి ముఖ్యమంత్రి చేస్తున్న కృషిని ఈ సమావేశంలో గడ్కరీ ప్రశంసించారని హ‌రీష్ రావు తెలిపారు.

(Visited 147 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *