ఇండ్లు లేని పారిశుద్ద కార్మికుల‌కు

ఇండ్లు లేని పారిశుద్ద కార్మికుల‌కు

ఇండ్లు లేని అర్హుల‌యిన పరిశుద్ధ్య కార్మికులకు డబుల్  బెడ్రూం ఇళ్ల పథకంలో ఇండ్లిస్తామని, అవసరమైతే ప్రత్యేక కోటా ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామ రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. మున్సిపల్ కార్మిక సంఘాలతో స‌మావేశ‌మ‌యిన ఆయ‌న కార్మికుల స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తమని హామి ఇచ్చారు.

కార్మికులతో ఇళ్లలో పనిచేయించుకునే అధికారులు, ప్రజాప్రతినిధులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పారిశుద్ధ్య కార్మికులతో పనిచేయించుకుంటే ఆయా కమీషనర్లే బాధ్యత వహించాలన్నారు. సమాచారం ఇస్తే వెంటనే స్థానిక కమిషనర్లను సస్పెండ్ చేస్తామని తెలిపారు. కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు హెల్త్ కార్డులు, ఈఎస్‌ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పిస్తామన్నారు. జీతాల పెంపు అంశాన్ని ముఖ్య‌మంత్రి దృష్టికి తీసుకెళ్తానన్నారు.

(Visited 46 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *