స‌ర్కారు ద‌స‌రా అఫ‌ర్

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు వినిపించింది. బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో ఈ నెల వేతనాన్ని ముందుగానే చెల్లించాలని నిర్ణయించింది. మామూలుగా ప్రతినెల 1వ తేదీన జీతాలు చెల్లిస్తుంది. అయితే ఈనెల 29 బతుకమ్మ, 30న దసరా కావడంతో ముందుగానే ఇస్తే పండుగ ఖర్చులకు ఉపయోగపడతాయని భావించిన ప్రభుత్వం అందుకు సంబంధించిన ఫైలును ఆర్థిక శాఖ ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు పంపింది. ముఖ్య‌మంత్రి ఆమోదం లభించిన వెంటనే జీతాలు ఎప్పుడివ్వాలనే దానిపై స్పష్టత వస్తుందని అధికారులు తెలిపారు. అందుబాటులో ఉన్న స‌మాచారం ప్ర‌కారం ఈ నెల 25నే జీతాలు వ‌చ్చే అవ‌కాశం ఉంది.

(Visited 59 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *