ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌ను

ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌ను

ఉత్త‌మ్ కుమార్ రెడ్డి నాయ‌క‌త్వంలో నేను అస‌లు ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌ను. పార్టీ కోసం అంకిత‌భావంతో ప‌ని చేస్తున్న సీనియ‌ర్ల‌ను ప‌ట్టించుకోవాలి, గౌర‌వించాలి అన్న జ్ఞానం పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డికి లేదు. ఆయ‌న నాయ‌క‌త్వంలో ఎన్నిక‌ల‌కు వెళ్తే ఐదారు సీట్ల‌కు మించి కాంగ్రెస్ గెలుపొంద‌దు అని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి అన్నారు.

మాజీ ముఖ్య‌మంత్రి కిర‌ణ్ కుమార్ రెడ్డి మూలంగా కాంగ్రెస్ గ‌త ఎన్నిక‌ల్లో న‌ష్ట‌పోయింద‌ని, ఆయ‌న‌కు స‌న్నిహితుడు అయిన ఉత్త‌మ్ ను చూసి తెలంగాణ ప్ర‌జ‌లు ఓట్లేస్తారా ? అని కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి ప్ర‌శ్నించారు. మాలాంటి సీనియ‌ర్ల‌ను పార్టీ నుండి బ‌య‌ట‌కు పంపితే ముఖ్య‌మంత్రి అవుతాన‌నే ఆశ‌లో ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఉన్నాడ‌ని, మేము పార్టీని వీడ‌తామ‌ని వాళ్లే ప్ర‌చారం చేస్తున్నార‌ని అన్నారు.

(Visited 368 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *