మంచినీళ్లు మ‌న హ‌క్కు

మంచినీళ్లు మ‌న హ‌క్కు

మంచినీళ్లు ప్ర‌జ‌ల హ‌క్కు. తెలంగాణ రాష్ట్రంలో ఇలాగే ఉంటుంది. ఉన్న ప్రాజెక్టుల‌కు తోడు కొత్త సాగునీటి ప్రాజెక్టుల‌ను నిర్మిస్తున్నాం. ఇందులో 10% జ‌లాల‌ను మంచినీటికోసం కేటాయిస్తున్నాం. కాళేశ్వ‌రంతో పాటు ఇత‌ర ప్రాజెక్టులు అన్నీ పూర్త‌యితే ఎంతో నీరు అందుబాటులోకి వ‌స్తుంది. ప్ర‌స్తుతం ఎస్సారెస్పీ, నాగార్జున సాగ‌ర్ లు అందుబాటులో ఉన్నాయి. కొత్త‌వి అందుబాటులోకి వ‌చ్చే వ‌ర‌కు మిష‌న్ భ‌గీర‌థ‌కు ఉన్న‌వాటినే వినియోగించుకోవాల‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ అన్నారు. కంటి శ‌స్త్ర‌చికిత్స త‌రువాత తొలిసారి ఆయ‌న మిష‌న్ భ‌గీర‌థ‌కు నీటి ల‌భ్య‌త‌పై ప్ర‌గ‌తిభ‌వ‌న్ లో అధికారుల‌తో చ‌ర్చించారు.

కాళేశ్వరం, పాలమూరు, సీతారామ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత నీటి స‌ర‌ఫ‌రాకు శాశ్వ‌త ప్ర‌ణాళిక సిద్దం చేసుకోవాల‌ని, నీటి పారుద‌ల శాఖ స‌మ‌న్వ‌యం కోసం మిష‌న్ భ‌గీర‌థ ప్ర‌త్యేకంగా అధికారిని నియమించాల‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆదేశించారు. తాగునీటికి రిజర్వాయర్లలో 10% నీటిని రిజర్వు చేస్తున్నందున అన్ని ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో కనీస నీటి వినియోగమట్టాలను పాటించాలని, అవసరమైనదానికంటే అదనంగా 25% జలాలను తాగునీటి అవసరాలకోసం నిల్వ ఉంచుకోవాలని కేసీఆర్ ఆదేశించారు.

(Visited 41 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *