బహరేన్ లో మృతుడికి ఆర్థిక‌సాయం

బహరేన్ లో మృతుడికి ఆర్థిక‌సాయం

కామారెడ్డి జిల్లా, గాంధారి మండలం, పోతంగల్ కలాన్ గ్రామానికి చెందిన మార్కంటి బాబు వయస్సు 34 పాస్పోర్ట్ నెంబర్M9743802 బహరేన్ లో ఒక్క ప్రైవేట్ కంపెనీ లో విధులు నిర్వహిస్తు 8 ఆగస్ట్ 2017న అకస్మాత్తుగా జరిగిన ఆక్సిడెంట్ ప్రమాదంలో మృతిచెందగా.వారి పార్ధీవ‌ దేహాన్ని మృతిచెందిన 15 రోజులలో ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బహరేన్ ఆధ్వర్యంలో 23 ఆగస్ట్ 17న స్వగ్రామానికి పంపించడం జరిగింది. వారికి భార్యతో పాటు ఒక కూతురు, కుమారుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

అతని మరణంతో పెద్ద దిక్కును కోల్పోయింన ఆ కుటుంబా పరిస్థితులను చూసి ముందుకు వచ్చిన ఎన్నారై టీఆర్ఎస్ సెల్ ప్రెసిడెంట్ రాధారపు సతీష్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్ బోలిశెట్టి, మరి బాబు తోటి కంపనీ లో పనిచేసే కార్మికులు, వారి ట్రాన్స్‌పోర్టేషన్‌ ఆఫీసర్ శివరాజ్ ప్రభు వారి అద్వర్యంలో ఆర్థిక సాయంగా 120, 309/- ఒక్క లక్ష ఇరవై వేల మూడు వందల తొమ్మిది రూపాయలు, ఆ బాదిత కుటుంబానికి బ్యాంక్ ద్వారా అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బహరేన్ ప్రెసిడెంట్ రాధారపు సతీష్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్ బోలిశెట్టి, జనరల్ సెక్రెటరీ డా రవి, సెక్రెటరీలు రవిపటేల్ దెషెట్టి, సుమన్ అన్నారం, జాయంట్ సెక్రెటరీలు గంగాధర్ గుమ్ముల, సంజీవ్ బురమ్, విజయ్ ఉండింటి, ఎగ్సిక్యుటివ్ మెంబర్స్ సుధాకర్ ఆకుల, నర్సయ్య, Ch రాజేందర్, వినోద్, సాయన్న, వసంత్ తదితరులు దీనికి కృషి చేశారు.

(Visited 115 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *