ఇది సంస్కరణలకు శ్రీకారం మాత్రమే !

ఇది సంస్కరణలకు శ్రీకారం మాత్రమే !

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టదలచుకున్న సమగ్ర భూ సర్వే గురించి రకరకాల సందేహాలు వ్యాప్తిలోకి వస్తున్నాయి. ఈ సర్వే విషయంలో కూడా ప్రజల్లో రకరకాల భయాలను నాటడానికి కొందరు కుట్ర పూరితమైన ప్రయత్నాలు నిరంతరాయంగా చేస్తూనే ఉన్నారు. అయితే భూ రికార్డులు సవ్యంగా లేకపోవడం వలన.. నిరుపేదలు.. అసలైన హక్కుదారులు ఎన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో.. భూమిని, యాజమాన్యాన్ని అనుభవించినంత కాలమూ ఇబ్బందులు తెలియకపోయినా.. విక్రయం లేదా ఇతర రూపేణా వాటిని బదలాయించదలచుకున్నప్పుడు.. అప్పటి వరకూ ఎరుకలేని కొత్త ఇబ్బందులు అనుభవించడం చూస్తూనే ఉన్నాం. వీటిని సంస్కరించడానికి మాత్రమే ప్రభుత్వం సమగ్ర భూ సర్వే ప్రయత్నం ప్రారంభిస్తోంది.
ఈ సర్వే ప్రభుత్వ భూముల లెక్క తీయడానికి మాత్రమే అని.. ఆక్రమణల్లో ఉన్న ప్రభుత్వ భూముల జోలికి వెళ్లడం లేదని అనేక సందేహాలు కూడా వ్యాప్తిలోకి వస్తున్నాయి. అయితే ఈ సమయంలో అందరూ గుర్తించాల్సిన విషయం ఒకటుంది. తెలంగాణలో భూముల రికార్డుల పరంగా పూర్తి స్థాయి సంస్కరణలు చేపట్టడానికి ఇది నాంది మాత్రమే. శ్రీకారం మాత్రమే. క్రమక్రమంగా అన్ని రకాల భూములకు సంబంధించి కూడా ఎలాంటి లోపాయికారీ వ్యవహారాలు లేకుండా రికార్డుల్ని చక్కబెట్టేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నదని తెలుసుకోవాలి.
రోజుకు 21 లక్షల ఎకరాల సర్వే ద్వారా అనుకున్న గడువులోగా రాష్ట్రంలోని భూముల్ని సర్వే చేయదడానికి పూనుకోవడం చాలా పెద్ద సాహసం కింద చెప్పాలి. ప్రజలందరి సహకారంతోనే ఈ అద్భుతం సాధ్యమవుతుందని కూడా మనం తెలుసుకోవాలి.

(Visited 63 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *