లోకల్ బీజేపీ చంటిగాళ్లూ వినిపిస్తుందా ?!

లోకల్ బీజేపీ చంటిగాళ్లూ వినిపిస్తుందా ?!

పార్టీల్లో ఒక వైఖరి ఉంటుంది. తమ బుద్ధితో నిమిత్తం లేకుండా.. తాము ఉన్న పార్టీ ని బట్టి, పనిగట్టుకుని ఏదో ఒకటి మాట్లాడేస్తూ ఉండడం వారికే చెల్లుతుంది. తాము చెబుతున్నది, చేస్తున్న ఆరోపణలు అన్నీ అబద్ధాలే అని ఆత్మసాక్షికి తెలిసినా కూడా యథేచ్చగా మాట్లాడేయడం ఇక్కడ మాత్రమే చెల్లుతుంది. నిజానికి తెలంగాణలో భాజపా స్థానిక నాయకులు కూడా అలాగే కనిపిస్తున్నారు. కేసీఆర్ సర్కారు చేపడుతున్న పథకాల్ని వారి పార్టీకి చెందిన ఇతర ప్రాంతాల పెద్దలే ప్రశంసిస్తోంటే… లోకల్ నాయకులు మాత్రం తమ విమర్శలను కంటిన్యూ చేస్తున్నారు.

తాజాగా బీహార్ ఉప ముఖ్యమంత్రి భాజపాకు చెందిన సుశీల్ కుమార్ మోడీ.. రాష్ట్రంలో చేసిన పర్యటన నిజంగానే ప్రభుత్వానికి ఎంతో నైతిక బలాన్ని అందించే పర్యటన. ఎందుకంటే.. భాజపాతో తెరాస మిత్ర పక్షం కాదు. కానీ భాజపాకు చెందిన బీహార్ ఉప ముఖ్యమంత్రి తెలంగాణలో ప్రాజెక్టులను, పోలీసు స్టేషన్ల పనితీరును స్వయంగా తెలుసుకుని.. ఇక్కడ అన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయంటూ ప్రశంసించడం చిన్న సంగతి కాదు. మిషన్ భగీరథ పేరిట.. తాగునీటి వసతి ప్రజలందరికీ కల్పించడానికి కేసీఆర్ సర్కారు ఎంత బృహత్ బాధ్యతను భుజానికెత్తుకున్నదో అందరికీ తెలుసు. అయితే.. అక్రమాలు జరిగిపోతున్నాయంటూ.. కాంగ్రెస్ వారు నిరాధారమైన ఆరోపణలతో పాడే పాచిపాటల బాటలోనే.. లోకల్ కమలనాధులు కూడా కలిసిపోతూ.. తమకు ప్రజల్లో ఉన్న విలువను కూడా పోగొట్టుకుంటున్నారు.

వారి పార్టీకే చెందిన సుశీల్ కుమార్ మోడీ మాత్రం తెలంగాణ ప్రభుత్వం కృషిని సర్వధా అభినందించడం… వీరు గుర్తించాలి. నిజంగా ప్రభుత్వ పనితీరులో లోపాలుంటే ఎత్తిచూపించాలే తప్ప.. తాము ప్రతిపక్షంలో ఉన్నాం గనుక.. పసలేని విమర్శలు చేస్తూ.. అడ్డగోలుగా మాట్లాడితే.. క్రమంగా వారికే నష్టం జరుగుతుందని లోకల్ భాజపా నేతలు తెలుసుకోవాలి.

(Visited 110 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *