దొంగ‌బాబాల జాబితా ఇదే

దొంగ‌బాబాల జాబితా ఇదే

సొంతంగా దేవుళ్లు అని ప్ర‌క‌టించుకుని సాధు సంతువుల‌కు చెడ్డ పేరు తెస్తున్నందున 14 మంది న‌కిలీ బాబాల జాబితాను అఖిల భారతీయ అఖాడా పరిషత్ విడుద‌ల చేసింది. ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది. అత్యాచారం కేసులో శిక్ష అనుభ‌విస్తున్న గుర్మీత్ సింగ్ తో పాటు, ఆయ‌న కుమారుడు నారాయ‌ణ సాయి ఈ జాబితాలో ఉన్నాడు, ఇటువంటి దొంగ బాబాల వల్ల ‘సంత్’కు ఉన్న గౌరవం దెబ్బ తింటోందని అఖాడా పరిషత్ అధ్యక్షుడు స్వామి నరేంద్ర గిరి అన్నారు.

ఆశారాం బాబు, రాధేమా, సచ్‌దరంగి, గుర్మీత్‌, ఓం బాబా, నిర్మల్‌ బాబా, విశ్వానంద్‌, స్వామి అశ్మిదానంద్‌, ఓం నమః శివాయ్‌, నారాయణ్‌ సాయి రాంపాల్‌లు ఈ ప‌రిష‌త్ విడుద‌ల చేసిన జాబితాలో ఉన్నారు. సంత్‌కు ఉన్న గౌరవాన్ని కాపాడేందుకు కొన్ని నిబంధనలు, ఆంక్షలు విధిస్తూ అఖాడా పరిషత్ నిర్ణయం తీసుకుంది.

ఆధ్యాత్మిక సేవలో ఉన్నవారిని ఇకపై వారి వ్యవహారాలను పూర్తిగా తెలుసుకున్నాకే సంత్‌గా గుర్తిస్తారని, సాధువులకు ఇకపై వ్యక్తిగతంగా ఎటువంటి ఆస్తులు కానీ, నగదు కానీ ఉండొద్ద‌ని .. ఇటువంటి దొంగ బాబాల వల్ల ‘సంత్’కు ఉన్న గౌరవం దెబ్బ తింటోందని అఖాడా పరిషత్ అధ్యక్షుడు స్వామి నరేంద్ర గిరి అన్నారు.

(Visited 289 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *