చేతులు కాలాక కేవీపీని ప‌ట్టుకున్నాడు

చేతులు కాలాక కేవీపీని ప‌ట్టుకున్నాడు

నంద్యాల‌, కాకినాడ ఉప ఎన్నిక‌ల ఓట‌మితో అంత‌ర్మ‌థ‌నంలో ప‌డ్డ ఆంధ్రా ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గన్మోహ‌న్ రెడ్డి ఇప్పుడు 2019 ఎన్నిక‌ల్లో స‌ల‌హాల కోసం .. స‌ర‌యిన మార్గ‌ద‌ర్శ‌క‌త్వం కోసం త‌పిస్తున్నాడు అని తెలుస్తుంది. జ‌గ‌న్ తండ్రి వైఎస్ ఆత్మ‌గా పేరు ప‌డ్డ కేవీపీ రాంచంద్రారావు అయితే త‌న‌కు అన్ని విధాలా న్యాయం చేస్తాడ‌ని భావిస్తున్న‌ట్లు తెలుస్తుంది.

వైఎస్, కేవీపీలు ఎంత స‌న్నిహితులో అంద‌రికీ తెలిసిందే. అయితే జ‌గ‌న్ వ్య‌వ‌హార శైలి కార‌ణంగానే కేవీపీ ఆయ‌న‌కు దూరం అయ్యార‌ని, జ‌గ‌న్ లో ఓపిక లేక‌పోవ‌డం ఆయ‌న‌కు న‌చ్చ‌లేద‌ని అందుకే ఆయ‌న ఇన్నాళ్లు దూరంగా ఉన్నాడ‌ని స‌మాచారం. అయితే తాజాగా వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి వ‌ర్ధంతి సంధ‌ర్భంగా ఇడుపుల‌పాయ‌కు వెళ్లిన కేవీపీతో జ‌గ‌న్ సుధీర్ఘ భేటీ జ‌రిపాడ‌ని తెలుస్తుంది. వైఎస్ కు రాజ‌కీయ స‌ల‌హాదారుగా ఉన్న కేవీపీ జ‌గ‌న్ కు స‌ల‌హాలు ఇచ్చేందుకు ఒప్పుకున్న‌ట్లు స‌మాచారం.

చంద్ర‌బాబును ఎదుర్కోవాలంటే ఆషామాషీ కాద‌ని, చంద్ర‌బాబు మీడియా వెన‌కేసుకొస్తుంద‌ని, ప్ర‌జ‌లు మ‌న వైపు ఉండాలంటే మ‌న భాష‌, న‌డ‌వ‌డిక మారాల‌ని కేవీపీ సూచించిన‌ట్లు తెలుస్తుంది. త్వ‌ర‌లోనే జ‌గ‌న్ వైపు కేవీపీ వ‌స్తాడ‌ని, ఆంధ్రాలో కాంగ్రెస్ కు భ‌విష్య‌త్ లేద‌ని తేలిన నేప‌థ్యంలో ఆయ‌న త‌న భ‌విష్య‌త్ ను వెతుక్కుంటాడ‌ని అంటున్నారు.

(Visited 723 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *