ఇక కండోమ్ అవ‌స‌రం లేదు !

ఇక కండోమ్ అవ‌స‌రం లేదు !

హ‌లో… హోల్డ్ ఆన్‌. ఇది పోర్న్ వార్త కాదు. ప్ర‌జా సంక్షేమ స‌మాచారం. అవాంచిత గర్భాన్ని అడ్డుకొనేందుకు సులువైన మార్గం. అది కూడా ప్ర‌భుత్వం చేసిన ప్ర‌య‌త్నం. కేవ‌లం ఒకే ఒక్క ఇంజెక్షన్‌తో 3 నెలల పాటు గర్భధారణను వాయిదా వేసుకోవచ్చు. వీటిని అతి త్వ‌ర‌లో మ‌న రాష్ట్రంలోకి తేబోతోంది గ‌వ‌ర్న‌మెంటు. జనాభా నియంత్రణకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇన్నోవేట్ చేసిన ఈ ఇంజెక్ష‌న్ పేరు ఇంట్రా మస్క్యులర్‌ ఇంజెక్షన్‌. తొలి దశగా పది రాష్ట్రాల్లో ఇది అంబాటులోకి తెచ్చారు. దేశంలో ఇదే తొలి ఇంజెక్టబుల్‌ కాంట్రసెప్టివ్‌. శాస్త్రీయంగా దీనిని డీఆక్సీ మెడ్రాక్సి ప్రొజెస్టిరాన్‌ ఎసిటేట్‌గా పిలుస్తారు.

ఇది గ‌ర్భాన్ని ఎలా నివారిస్తుందంటే.. ఈ ఇంజెక్షన్ మ‌హిళ‌కు వేశాక 3 నెలల పాటు మ‌హిళ‌ అండాల విడుదల నిలిచిపోతుంది. ఫలితంగా మహిళ గర్భం ధరించే అవకాశం ఉండదు. 18 నుంచి 45 ఏళ్ల వివాహిత మహిళలు ఈ ఇంజెక్షన్లను వినియోగించుకొని అవాంఛిత గర్భధారణను నిరోధించవచ్చని వైద్య శాఖ అధికార వర్గాలు వెల్లడించాయి. వీటిని మొద‌ట మెడిక‌ల్ కాలేజీల‌కు, జిల్లా ఆస్పత్రులకు ఇస్తారు. అనంత‌రం అన్ని ఆస్ప‌త్రుల‌కు అంద‌జేస్తారు.
దేశంలో డిమాండ్‌కు తగినట్లుగా గర్భ నిరోధక సాధనాలు లేకపోవడం వ‌ల్ల‌ 12.9 శాతం అవాంఛిత గర్భాలు వ‌చ్చి, జ‌నాభా పెరుగుతోంద‌ని స‌ర్కారు గుర్తించింది. అందుకే దీనిని క‌నిపెట్టింది. అంటే ఇది పెళ్ల‌యిన దంప‌తులు అధిక సంతానం వ‌ద్ద‌కుంటే వాడాల‌ని గుర్తుపెట్టుకోండి. అక్ర‌మ సంబంధాలు, టీనేజ్ శృంగారాల‌కు కూడా ఇదే మంచి మందు అనుకుంటే గ‌ర్భం సంగ‌తి త‌ర్వాత ఇత‌ర రోగాలు వ‌స్తాయి సుమా!

injectable contraceptives
(Visited 357 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *