తెలంగాణ పోలీసుకు బీహార్ ప్ర‌శంస‌లు

తెలంగాణ పోలీసుకు బీహార్ ప్ర‌శంస‌లు

తెలంగాణ పోలీసుల పనితీరు చాలా బాగుంది. నేరాల నియంత్ర‌ణ‌లో తెలంగాణ పోలీసుల కృషి అభినంద‌నీయం. తెలంగాణలో ప్రభుత్వం ఆధునాతన పోలీసు స్టేషన్లను నిర్మించింది అని బీహార్ ఉప ముఖ్య‌మంత్రి సుశీల్ కుమార్ మోదీ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. రాష్ట్ర ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఆయ‌న ఈ రోజు పంజ‌గుట్ట పోలీస్ స్టేష‌న్ ను సంద‌ర్శించారు. తెలంగాణ పోలీసు స్టేషన్లలో ఉన్న‌ ఫిర్యాదుల విధానం దేశంలో మరెక్కడా లేదని, తమ రాష్ట్రంలో ఇలాంటి విధానం అమలు చేసేందుకు కృషి చేస్తానని మోదీ అన్నారు.

తెలంగాణ ప్ర‌భుత్వ ప‌థ‌కాలు ఎంతో బాగున్నాయ‌ని, బాలింత‌ల‌కు ప్ర‌భుత్వం ఇస్తున్న కేసీఆర్ కిట్ అద్భుతం అని సుశీల్ కుమార్ మోదీ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ పథకాలు దేశంలోని చాలా రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని, వెన‌క‌బ‌డ్డ బీహార్ లో ప్ర‌వేశ‌పెట్టాల్సిన ప‌థ‌కాల గురించి అనేక రాష్ట్రాల‌లో అధ్య‌య‌నం చేస్తున్నామ‌ని తెలిపారు.

(Visited 192 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *