September 10, 2017

తెలంగాణ పోలీసుకు బీహార్ ప్ర‌శంస‌లు

తెలంగాణ పోలీసుల పనితీరు చాలా బాగుంది. నేరాల నియంత్ర‌ణ‌లో తెలంగాణ పోలీసుల కృషి అభినంద‌నీయం. తెలంగాణలో ప్రభుత్వం ఆధునాతన పోలీసు స్టేషన్లను నిర్మించింది అని బీహార్ ఉప ముఖ్య‌మంత్రి సుశీల్ కుమార్ మోదీ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. రాష్ట్ర ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఆయ‌న ఈ రోజు పంజ‌గుట్ట పోలీస్ స్టేష‌న్ ను సంద‌ర్శించారు. తెలంగాణ పోలీసు స్టేషన్లలో ఉన్న‌ ఫిర్యాదుల విధానం దేశంలో మరెక్కడా లేదని, తమ రాష్ట్రంలో ఇలాంటి విధానం అమలు చేసేందుకు కృషి చేస్తానని మోదీ అన్నారు. తెలంగాణ ప్ర‌భుత్వ ప‌థ‌కాలు ఎంతో బాగున్నాయ‌ని, బాలింత‌ల‌కు ప్ర‌భుత్వం ఇస్తున్న కేసీఆర్ కిట్ అద్భుతం అని సుశీల్

ఎంత మంది పెండ్లాలు గావలె ఏపురి సోమ‌న్న‌

ఎందుకురో ఏడుస్తున్న‌వ్ ఏపురి సోమ‌న్న .. నీకు ఎంతా మంది పెండ్లాలు గావ‌లె ఏపురి సోమ‌న్న .. తెలంగాణ క‌ళాకారుడిని అయిన త‌న‌ను ప్ర‌భుత్వం క‌క్ష్య‌గ‌ట్టి త‌న వ్య‌క్తిగ‌త కుటుంబ విభేదాల‌ను సాకుగా తీసుకుని తెలంగాణ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా పాట‌లు పాడుతున్నాన‌ని ప్ర‌భుత్వం నిర్భంధిస్తుంద‌ని ఆరోప‌ణ‌లు చేస్తున్న ఏపూరి సోమ‌న్న వ్య‌వ‌హారంపై తెలంగాణ క‌ళాకారిణి, న‌కిరేక‌ల్ ఎమ్మెల్యే వేముల వీరేశం స‌తీమ‌ణి వేముల పుష్ప ఐ టీవీ న్యూస్ ఛాన‌ల్ ఐ కౌంట‌ర్ లో దుమ్ము దులిపింది. తిరుమ‌ల గిరి పోలీస్ స్టేష‌న్ లో ఎవ‌రూ ప‌ట్టించుకోకపోవ‌డంతో సోమ‌య్య మొద‌టి ఇద్ద‌రు భార్య‌లు ఫోన్ చేయ‌డంతో వెళ్లిన పుష్ప‌,

తెలంగాణ రైతులను ధనికులుగా తయారు చేస్తాం

తెలంగాణ రైతులను ధనికులుగా తయారుచేస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా లోని బిచ్కుందలో రైతు సమన్వయ సమితి అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో పాల్గొన్న పోచారం మాట్లాడుతూ… బ్యాంకులు రైతుల దగ్గరకు వచ్చి రుణాలిచ్చేలా చర్యలు చేపడతామన్నారు. అలాగే పంట మద్దతు ధరను రైతు సమన్వయ సంఘాలే నిర్ణయించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సదస్సులో పార్లమెంటు సభ్యుడు ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే, జడ్పి చైర్మన్ రాజు తదితరులు పాల్గొన్నారు.

సమగ్ర భూ సర్వే: మంచీ చెడూ

సమగ్ర భూసర్వే అవసరం ఏమిటి? ఎంత వరకు సఫలం అవుతుంది. దీని ఫలాలు ఎలా ఉంటాయి అనే విషయమై రిటైర్డు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ జయచంద్రారెడ్డి  తన విశ్లేషణను తెలుగుటీవీ డాట్ టీవీ తో ప్రత్యేకంగా పంచుకున్నారు. ఆ వివరాలు మేడిన్ టీజీ డాట్ కామ్ పాఠకుల కోసం… == అసలు సమగ్ర భూ సర్వే వల్ల కబ్జాలు తొలగిపోయే పరిస్థితి వస్తుందా? ఆక్రమణలలకు, అక్రమార్కులకు అడ్డుకట్ట వేయడం కుదురుతుందా? ఈ అంశాలపై జయచంద్రారెడ్డి విశ్లేషణ తెలుసుకోవడానికి రెండో భాగం కోసం చూస్తూనే ఉండండి.

ఇక కండోమ్ అవ‌స‌రం లేదు !

హ‌లో… హోల్డ్ ఆన్‌. ఇది పోర్న్ వార్త కాదు. ప్ర‌జా సంక్షేమ స‌మాచారం. అవాంచిత గర్భాన్ని అడ్డుకొనేందుకు సులువైన మార్గం. అది కూడా ప్ర‌భుత్వం చేసిన ప్ర‌య‌త్నం. కేవ‌లం ఒకే ఒక్క ఇంజెక్షన్‌తో 3 నెలల పాటు గర్భధారణను వాయిదా వేసుకోవచ్చు. వీటిని అతి త్వ‌ర‌లో మ‌న రాష్ట్రంలోకి తేబోతోంది గ‌వ‌ర్న‌మెంటు. జనాభా నియంత్రణకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇన్నోవేట్ చేసిన ఈ ఇంజెక్ష‌న్ పేరు ఇంట్రా మస్క్యులర్‌ ఇంజెక్షన్‌. తొలి దశగా పది రాష్ట్రాల్లో ఇది అంబాటులోకి తెచ్చారు. దేశంలో ఇదే తొలి ఇంజెక్టబుల్‌ కాంట్రసెప్టివ్‌. శాస్త్రీయంగా దీనిని డీఆక్సీ మెడ్రాక్సి ప్రొజెస్టిరాన్‌ ఎసిటేట్‌గా పిలుస్తారు.

అమెరికా కొంప మునుగుతోంది !

అమెరికా కొంప మునుగుతోంది. ప్ర‌పంచాన్నే గ‌డ‌గ‌డలాడించ‌గ‌ల‌మనే అమెరికాను ఒక తుఫాను గ‌డ‌గ‌డ‌లాడిస్తోంది. గంట‌కు 300 కిలోమీట‌ర్ల వేగంతో గాలి అంటే… వైజాగ్ ను తుడిచేసిన తుఫాను కంటే పెద్ద‌ది. అది కూడా సుమారు 33 గంట‌ల‌పాటు వీచింది. వంద‌ల ఏళ్ల చెట్లు కూడా నేల వాలి క‌నిపించ‌కుండా కొట్టుకుపోయాయి. 63 ల‌క్ష‌ల జ‌నాభా ఉన్న ఫ్లోరిడా ను వ‌దిలి జ‌నం వేరే న‌గ‌రాల‌కు త‌ర‌లిపోతున్నారు. ఇపుడు ఆ న‌గ‌రం ఎలా ఉందంటే.. ఐ యామ్ లెజెండ్ సినిమాలో అబాండ‌న్డ్ సిటీగా మారిపోయింది. ఫ్లోరిడా స‌ముద్రంలోకి చొచ్చుకు వ‌చ్చిన ప్రాంతం కావ‌డం వ‌ల్ల ఆ రాష్ట్రానికి ఇన్ని తిప్ప‌లు. దాని