స‌చిన్ ను మించిన కొహ్లీ

స‌చిన్ ను మించిన కొహ్లీ

స‌చిన్ టెండూల్క‌ర్ అభిమానులు క్రికెట్ దేవుడిగా స‌చిన్ భావిస్తారు. అయితే స‌చిన్ టెండూల్క‌ర్ ను మించి ఎక్కువ మందిని ఆకర్షించాడు ఫేస్ బుక్ లో ప్ర‌ముఖ క్రికెట‌ర్, టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ. 35.8 మిలియ‌న్ల ఫాలోవ‌ర్స్ తో కొహ్లీ అగ్ర‌స్థానంలో ఉంటే, 28.5 మిలియ‌న్ల ఫాలోవ‌ర్స్ తో సచిన్ ఆరో స్థానంలో నిలిచాడు. ద‌క్షిణాది నుండి టాప్ 15లో ఒక్క కాజ‌ల్ మాత్ర‌మే చోటు దక్కించుకుంది.

35.3 మిలియన్ల మంది ఫాలోవ‌ర్స్ తో రెండో స్థానంలో సల్మాన్ ఖాన్ నిల‌వ‌గా, 34 మిలియ‌న్ ఫాలోవ‌ర్స్ తో దీపికా ప‌దుకొణే, ప్రియాంక చోప్రా (32.3 మిలియన్లు), హనీసింగ్‌ (30.4 మిలియన్లు) త‌రువాత స్థానాల‌లో నిలిచారు. ఏడో స్థానంలో శ్రేయా ఘోషల్‌ (28.3 మిలియన్లు), ఎనిమిదో స్థానంలో అమితాబ్‌ బచ్చన్‌ (27.2 మిలియన్లు), తొమ్మిదో స్థానంలో మాధురీ దీక్షిత్‌ (26 మిలియన్లు), ప‌ద‌వ స్థానంలో కపిల్‌శర్మ (26 మిలియన్లు) ఉన్నారు. ఆ త‌రువాతి స్థానాల్లో వ‌రుస‌గా సోనాక్షి సిన్హా (23.7 మిలియన్లు), అక్షయ్‌ కుమార్‌ (23.7 మిలియన్లు), షారుక్‌ ఖాన్‌ (23.6 మిలియన్లు), ఎ.ఆర్‌. రెహమాన్‌ (22.8 మిలియన్లు) ఉండ‌డం గ‌మ‌నార్హం.

(Visited 107 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *