ఈ శోభారాణి గుర్తుందా ?

ఈ శోభారాణి గుర్తుందా ?

ప్ర‌జారాజ్యం పార్టీలో మ‌హిళా విభాగం అధ్య‌క్షురాలిగా ప‌నిచేసి చందోలు శోభారాణి గుర్తుందా. ప్ర‌జారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో క‌లిపిన‌ప్పుడు చిరంజీవి మీద ఒంటి కాలి మీద లేచిన శోభారాణి తెలంగాణ ఉద్య‌మాన్ని వ్య‌తిరేకిస్తూ నానా హంగామా చేసింది. జై బోలో తెలంగాణ సినిమాకు వ్య‌తిరేకంగా జై బోలో స‌మైక్యాంధ్ర సినిమాను తీస్తున్నానంటూ ప్ర‌క‌టించింది. ఆ త‌రువాత ఆ సినిమా ఊసులేద‌న్న‌ది వేరే సంగతి.

ప్ర‌జారాజ్యం అధినేత చిరంజీవి కాడి మ‌ధ్య‌లోనే దించి పార్టీని కాంగ్రెస్ పార్టీలో క‌లిపి కేంద్ర మంత్రి ప‌ద‌విని ద‌క్కించుకున్నాడు. దీనిని నిర‌సిస్తూ చిరంజీవిని చెప్పుల‌తో కొడ‌తాన‌ని హెచ్చ‌రిక‌లు చేసింది. ఇక రాంగోపాల్ వ‌ర్మ సినిమా బెజ‌వాడ రౌడీలు టైటిల్ కు వ్య‌తిరేకంగా హైద‌రాబాద్ ఫిల్మ్ ఛాంబ‌ర్ లో ర‌భ‌స చేసింది. ఇలాంటి వివాదాలే కాకుండా ఆమెకు ప్ర‌ముఖ సినీ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ తో వివాహం జ‌రిగిన‌ట్లుగా మార్ఫింగ్ ఫోటోలు ఇంట‌ర్నెట్ లో ద‌ర్శ‌న‌మివ్వ‌డం క‌ల‌క‌లం రేపింది. ఆ త‌రువాత సైలెంట్ అయిపోయిన శోబారాణి ఇన్నాళ్ల‌కు తిరిగి వార్త‌ల్లోకి వ‌చ్చింది.

తెలుగుదేశం పార్టీ నుండి ప్ర‌జారాజ్యం పార్టీలో చేరిన శోభారాణి ఎట్ట‌కేల‌కు తిరిగి సొంత‌గూటికి చేరుకుంది. గుంటూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఏపీ మంత్రి ఆనందబాబు సమక్షంలో శోభారాణి తెలుగుదేశం పార్టీలో చేరింది. చంద్ర‌బాబు అభివృద్ది త‌న‌ను ఆక‌ర్షించింద‌ని, అందుకే తిరిగి టీడీపీలోకి వ‌చ్చాన‌ని ఆమె తెలిపింది.

(Visited 4,101 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *