స్వామికార్యం .. స్వ‌కార్యం

స్వామికార్యం .. స్వ‌కార్యం

ముఖ్య‌మంత్రి కేసీఆర్ కంటి శ‌స్త్ర‌చికిత్స నిమిత్తం ఢిల్లీకి వెళ్లిన రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖా మంత్రి కేటీఆర్ గ‌త నాలుగు రోజులుగా అక్క‌డ ఉంటూ స్వామి కార్యం .. స్వ‌కార్యం రెండూ నెర‌వేరుస్తున్నారు. కేసీఆర్ కుమారుడిగా శ‌స్త్ర‌చికిత్స స‌మ‌యంలో వెంట ఉండేందుకు వెళ్లిన కేటీఆర్ గ‌త మూడు రోజులుగా కేంద్రంలోని పెద్ద‌ల‌ను క‌లిసి తెలంగాణ అభివృద్దికి సంబంధించి ప‌లు విన‌తిప‌త్రాలు స‌మ‌ర్పిస్తున్నారు.

ఈ రోజు ఢిల్లీలో జ‌రిగిన ఇన్వెస్ట్ ఇండియా కార్య‌క్ర‌మంలో పాల్గొని తెలంగాణ‌లో పెట్టుబ‌డుల‌కు ఉన్న అవ‌కాశాల‌ను ప్ర‌ముఖుల‌కు వివ‌రించారు. అనంత‌రం ఎంపీలు సీతారాం నాయ‌క్, సుమ‌న్, రెసిడెంట్ క‌మీష‌న‌ర్ అర‌వింద్ కుమార్ ల‌తో క‌లిసి ఢిల్లీ మెట్రో రైలులో ప్ర‌యాణించారు. ఈ వివ‌రాల‌ను ఆయ‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు.

(Visited 213 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *