అప్ప‌ట్లో ఇలా సంపాదించుకున్నాడు

అప్ప‌ట్లో ఇలా సంపాదించుకున్నాడు

పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి సినిమాలతో ఘ‌న విజ‌యాలు సాధించిన విజ‌య్ దేవ‌ర‌కొండకు ఇప్పుడు చేతినిండా పని ఉంది. అయితే ఈ హిట్లు రాక ముందు విజ‌య్ డ‌బ్బులు ఎలా సంపాదించుకునేవాడో తెలుసా ? థియేట‌ర్ ఆర్ట్స్ లో శిక్ష‌ణ పొందిన విజ‌య్ చిన్నారుల‌కు న‌ట‌న‌లో శిక్ష‌న ఇచ్చేవాడు. ఈ విష‌యాన్ని త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ల ద్వారా వెల్ల‌డించాడు.

2012లో తాను స్క్రిప్ట్ రాసుకుని, దర్శ‌కత్వం బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తూ పిల్ల‌ల‌కు న‌ట‌న నేర్పేవాడిన‌ని, అలా డ‌బ్బు సంపాదించుకునే వాడిన‌ని అన్నాడు. తనకి ఎంతో ఇష్టమైన ఆ పనిని ఇప్ప‌టికీ చేస్తున్నాన‌ని పేర్కోన్నాడు. చిన్నారుల‌తో త‌న ఫోటోల‌ను పోస్ట్ చేశాడు.

(Visited 536 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *