స‌సేమిరా అంటున్న‌ బాల‌య్య‌

స‌సేమిరా అంటున్న‌ బాల‌య్య‌

ముఖ్య‌మంత్రి ప‌ద‌వా ? అబ్బే నాకు అక్క‌ర్లేదు. నాకు మా నాన్న‌గారు పోటీ చేసి గెలిచిన హిందూపురం అభివృద్దే ముఖ్యం. అస‌లు నేను ఎన్న‌డూ ఆ ముఖ్య‌మంత్రి ప‌ద‌వి మీద గానీ .. పెద్ద పెద్ద ప‌దవుల మీద గానీ ఆశ‌లు పెట్టుకుని రాజ‌కీయాల్లోకి వ‌చ్చింది లేదు. హిందూపురం స‌మ‌స్య‌ల ప‌రిష్కార‌మే నాకు ముఖ్యం. ఇక్క‌డ స‌మ‌స్య‌ల త‌రువాత‌నే తెలుగుదేశం పార్టీకి నా సేవ‌లు అందిస్తాను. అంతే గానీ ముఖ్య‌మంత్రి ప‌ద‌వి కోసం నేను ఆశ‌ప‌డ‌లేదు అంటున్నాడు ఎన్టీఆర్ కుమారుడు, చంద్ర‌బాబు బావ‌మ‌రిది, ప్ర‌ముఖ హీరో బాల‌కృష్ణ‌.

ఎప్ప‌టిక‌యినా త‌మ అభిమాన హీరో, అభిమాన నేత కుమారుడు అయిన బాల‌కృష్ణ ముఖ్య‌మంత్రి కాక‌పోతాడా తాము చూడ‌క‌పోతామా అన్న ఎన్టీఆర్ అభిమానుల ఆశ‌ల మీద బాల‌య్య నీళ్లు చల్లాడు. ఎన్న‌డ‌యినా బ‌య‌టకు వ‌చ్చిన‌ప్పుడు క‌నీసం నినాదాల‌తో అయినా తృప్తి ప‌డ‌దాం అనుకుంటే ఇప్పుడు ఈ వ్యాఖ్య‌ల‌తో ఆ సంతోషం లేకుండా చేశాడు. బావ వార్నింగ్ ఇచ్చాడో .. అల్లుడు అడ్డు పుల్ల‌లు వేశాడో లేకుంటే ఎవ‌రికీ భ‌య‌ప‌డ‌ని బాల‌య్య ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం ఏంట‌ని అభిమానులు అంటున్నారు.

(Visited 323 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *