ఆస్ట్రేలియా ప్రతినిధులతో టీఎస్ ఎండీసీ భేటీ

ఆస్ట్రేలియా ప్రతినిధులతో టీఎస్ ఎండీసీ భేటీ

ఆస్ట్రేలియాలో అధికారిక పర్యటనలో ఉన్న తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ ఛైర్మన్ శేరి సుభాష్ రెడ్డి మెల్బోర్న్ లోవిక్టోరియా రాష్ట్ర మైనింగ్ ప్రతినిధి లీ విల్మోట్ అద్వర్యం లో జరిగిన భేటీ లో TSMDC MD మల్సూర్ తో కలిసి పాల్గొన్నారు . తెలంగాణ ప్రభుత్వం మైనింగ్ ఇండస్ట్రీ లో సాధిస్తున్న అభివృద్ధి పై , తెలంగాణ లో పుష్కలంగా ఉన్న ఖనిజ సంపద లభ్యత పైన , వీటితో పాటు పర్యావరణ పరిరక్షణ కు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆస్ట్రేలియా మైనింగ్ ప్రతినిధి లీ విల్మోట్ బృందానికి శేరి సుభాష్ రెడ్డి వివరించారు .

తెలంగాణ రాష్ట్రం లో పుష్కలంగా లభిస్తున్న రాగి , లైం స్టోన్ మైనింగ్ అన్వేషణ కోసం నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని , ఇనుము ధాతువు ను మెరుగు పరచడానికి అవలంబిస్తున్న పద్దతులను , తెలంగాణ లో విరివిగా లభిస్తున్న సున్నపు రాయి కోసం ఆస్ట్రేలియా మార్కెట్ లభ్యత సమాచారాన్ని , తెలంగాణ రాష్ట్రం లోఖనిజ వనరుల లభ్యత ఉన్న ప్రదేశాలను గుర్తించే లేటెస్ట్ మ్యాప్ ను రూపొందించడానికి అవసరమయ్యే పరిజ్ఞాన్ని అందించాలని tsmdc చైర్మన్ శేరి సుభాష్ రెడ్డి కోరారు. దీని పై సానుకూలంగా స్పందించిన లీ విల్మోట్ బృందం తెలంగాణ ప్రభుత్వం తో స్నేహ పూర్వక సంబంధాన్ని ఇచ్చి పుచ్చు కునే ధోరణి లోకొనసాగిస్తామని హామీ ఇచ్చ్చారు .

అలాగే అక్టోబర్ ౩౦ నుండి నవంబర్ మూడు వరకు ఆస్ట్రేలియా లో జరిగే అంతర్జాతీయ మైనింగ్ సదస్సు కు 65 దేశాల ప్రతినిధులు పాల్గొంటారని దానికి మంత్రి కేటీర్ మరియు tsmdc బృందాన్ని ఆహ్వానించనున్నామని లీ విల్మోట్ తెలిపారు .తెలంగాణ రాష్ట్రం లో ఖనిజ వనరుల లభ్యత , ప్రదేశాల కు సంబందించిన పూర్తి సమాచారాన్నిడా . మల్సూర్ గారు లీ విల్మోట్ బృందానికి వివరించారు .

(Visited 95 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *