షాలిని పిల్ల‌కి.. సినిమా క‌ష్టాలు!

షాలిని పిల్ల‌కి.. సినిమా క‌ష్టాలు!
ప్ర‌స్తుతం టాలీవుడ్ లో అంద‌రూ అర్జున్ రెడ్డి సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. అర్జున్ రెడ్డి పాత్ర‌లో జీవించిన విజ‌య్ దేవ‌ర‌కొండ ను ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తుతున్నారు. ఆ సినిమా విజ‌యంలో కీ రోల్ ప్లే చేసిన విజ‌య్ తో పాటు  ప్రీతి పాత్ర‌లో న‌టించిన‌ హీరోయిన్ షాలినికి కూడా ప్ర‌శంస‌లు ద‌క్కాయి. అయితే, ఈ సినిమాలో చాన్స్ రాక ముందు షాలిని నిజంగా సినిమా క‌ష్టాల‌ను ఫేస్ చేసింద‌ట‌. సినిమాల మీద ఉన్న ఆస‌క్తితో నిజ‌జీవితంలో కూడా తాను ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోయింద‌ట‌. తాను ఎదుర్కొన్న ఇబ్బందుల‌ను షాలిని సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ఇపుడు ఆ పోస్ట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.
షాలిని తండ్రి మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ కు చెందిన ఒక గవర్నమెంట్ ఉద్యోగి. ఆమె ఇంజనీరింగ్ చదివే సమయంలోనే సినిమా రంగంలోకి రావాల‌ని అనుకుంది. నటనలో మంచి ప్రతిభ క‌న‌ప‌ర‌చడంతో షాలినిని ఆమె తండ్రి కొన్నాళ్లు ఎంక‌రేజ్ చేశాడు. త‌రువాత‌ ఓ దశలో సినిమాలు వ‌ద్ద‌ని చెప్ప‌డంతో ముంబై లో ఫ్రెండ్స్ దగ్గరకు  వెళ్లి ఇక ఇంటికి రాలేదు. తన కేరీర్ కు అడ్డుపడుతుండట్తో తల్లితండ్రులపై కేసు పెడ‌తాన‌ని బెదిరించింద‌ట‌. దీంతో షాలిని తండ్రి ఎప్పటికీ ఆమెను ఇంటికి తిరిగి రావ‌ద్ద‌ని చెప్పేశాడు. తన వద్ద ఉన్న కొంత డబ్బుతో షాలిని ఓ చిన్న గదిలో అద్దెకు ఉందట. డబ్బులు మిగుల్చుకోవడానికి నడిచి వెళ్లడం, ఒక్కోసారి భోజనం మాని వేసిన దాఖలాలు కూడా ఉన్నాయట. అర్జున్ రెడ్డి సినిమా ఆఫర్ వచ్చిన తర్వాత షూటింగ్ మొదలు కావడానికి ఇంకా సమయం ఉండటంతో డబ్బులు సరిపోలేదట. దాంతో ఇద్దరు అబ్బాయిలతో ఒకే గ‌దిని షేర్ చేసుకుంద‌ట‌. అటువంటి పరిస్థితిలో రెండు నెలలపాటు ఉన్న త‌ర్వాత అర్జున్ రెడ్డి సినిమా షూటింగ్ స్టార్ట‌యింద‌ని షాలిని త‌న క‌ష్టాల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది.
(Visited 94 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *