అన‌సూయ‌కు ‘అర్జున్..’ ఫ్యాన్స్ షాక్‌!

అన‌సూయ‌కు 'అర్జున్..' ఫ్యాన్స్ షాక్‌!
టాలీవుడ్ లో ప్ర‌ముఖ ద‌ర్శ‌కులు, హీరోలు, హీరోయిన్లు అర్జున్ రెడ్డి సినిమాపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే, అందుకు భిన్నంగా జ‌బ‌ర్ద‌స్త్ యాంక‌ర్ అన‌సూయ మాత్రం ఆ సినిమాలో ఓ డైలాగ్ పై తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ ట్విట్ట‌ర్ లో ఓ భారీ మెసేజ్ పెట్టిన సంగ‌తి తెలిసిందే. అమ్మను తిడుతూ చేసిన బూతు ప‌ద ప్ర‌యోగానికి లక్షల మంది ఫాలోయింగ్ లభించడం ఎంతో అదృష్టం కదా అంటూ అన‌సూయ ఘాటుగా కామెంట్ చేసింది. నీ జీవితంలో ఉన్న మహిళల‌ గురించి మరొకరు ఇలాగే మాట్లాడితే అప్పుడేం చేస్తావ్ డూడ్.. వారి లేడీస్ ను తిడతావా అంటూ క్లాస్ పీకింది. అంత‌టితో ఆగ‌కుండా అర్జున్ రెడ్డి టీం త‌మ ప్ర‌తిభ‌ను స‌రిగా ఉప‌యోగించుకోవాల‌ని ఓ శాంతి సందేశం పంపింది.
అయితే, అన‌సూయపై అర్జున్ రెడ్డి సినిమా అభిమానులు ఫైర్ అవుతున్నారు. తల్లి గురించిన వ్యాఖ్య‌ల‌పై అభ్యంత‌రం చెబుతున్న అన‌సూయ ముందు త‌న వ‌స్త్ర ధార‌ణ మార్చుకోవాల‌ని సూచిస్తున్నారు. జ‌బ‌ర్ద‌స్త్ షోలో అటువంటి డ్రెస్ లు వేసుకొని, డ‌బుల్ మీనింగ్ డైలాగులు చెప్పే అన‌సూయ ఈ సినిమాపై కామెంట్ చేయ‌డం ఏమిట‌ని జోకులు వేస్తున్నారు. నీతులు చెప్పే ముందు వాటిని ఆచ‌రించి చూపాల‌ని ఆమెపై నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు.  ఏం మాట్లాడుతున్నావ్ అన‌సూయ‌….. అంటూ ఓ వ్య‌క్తి కామెంట్ పెట్టాడు. జ‌బ‌ర్ద‌స్త్ డ‌బుల్ మీనింగ్ అన‌సూయ‌…డ‌బుల్ స్టాండ‌ర్డ్ తీసుకుంద‌ని, రెండు నాలుక‌ల‌తో మాట్లాడుతోంద‌ని ఓ నెటిజ‌న్ అన్నాడు. వీహెచ్ ను చిల్ తాత‌య్యా అన్న‌ట్లు గానే …ఓ నెటిజ‌న్ అన‌సూయ‌ను టేక్ కేర్ గ్రానీ అంటూ చ‌మ‌త్క‌రించాడు.
(Visited 1,175 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *