అర్జున్ రెడ్డిపై అన‌సూయ సెటైర్లు

అర్జున్ రెడ్డిపై అన‌సూయ సెటైర్లు

అర్జున్ రెడ్డి సినిమా గురించి చిన్నా, పెద్దా అంతా ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. సినీ విమ‌ర్శ‌కులు సైతం హీరో విజ‌య్, ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డిని ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తుతున్నారు. విజ‌య్ న‌ట‌న‌కు ప్ర‌ముఖ న‌టులు, ద‌ర్శ‌కులు ఫిదా అయిపోయారు. తెలంగాణ సూప‌ర్ స్టార్ అంటూ ఆకాశానికి ఎత్తుతున్నారు. కానీ ప్ర‌ముఖ యాంక‌ర్ అన‌సూయ‌కు మాత్రం ఈ సినిమా న‌చ్చ‌లేద‌ట‌.

ఈ సినిమాలో మాదిరిగానే యువ‌త బ‌య‌ట ఉండాల‌ని విజ‌య్ యువ‌త‌కు స‌ల‌హాలు ఇస్తున్నాడ‌ని .. ఇది ప‌ద్ద‌తి కాద‌ని అన‌సూయ ఆక్షేపించింది. ఇక మాద .. చోత్ అనేది యువ‌త వాడుక ప‌దంలా మారింద‌ని, అంద‌రూ దీనిని జోక్ లా మాట్లాడుతున్నార‌ని విజ‌య్ ని విమ‌ర్శించింది అన‌సూయ‌. మీ ఇంట్లో ఆడ‌వాళ్ల‌ని ఎవ‌ర‌యినా అవ‌మానిస్తే వాళ్ల త‌ల్లుల్ని ఇలా తిట్ట‌మ‌ని చెప్తావా ? నువ్వు ఇంకా ఎద‌గాలి .. ఈ సినిమా తాను చూడ‌లేద‌ని, చూడాల‌నుకున్నా థియేట‌ర్ల‌లో జ‌నం ఎలాంటి భూతులు మాట్లాడుతారో అన్న భ‌యంతో వెళ్ల‌డం లేద‌ని అంటుంది అన‌సూయ‌.

ఒక్క సినిమా గురించి ఇన్ని సుద్దులు చెబుతున్న యాంక‌ర్ అన‌సూయ తాను యాంక‌రింగ్ చేసిన జ‌బ‌ర్ధ‌స్త్ టీవీ షోలో డ‌బ‌ల్ మీనింగ్ డైలాగుల‌తో .. అశ్లీల వేష‌దార‌ణ‌తో ఎపిసోడ్ల మీద ఎపిసోడ్లు చూసి యువ‌త ఎంత ప్ర‌భావితం అయింది ఏనాడ‌యినా ఆలోచించిందో లేదో ? మ‌నం పాటించి ఇత‌రుల‌కు నీతులు చెబితే బాగుంటుంది అన‌సూయ అంటున్నారు అర్జున్ రెడ్డి మ‌ద్ద‌తుదారులు.

(Visited 2,817 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *