నిరుద్యోగుల‌కు శుభ‌వార్త

నిరుద్యోగుల‌కు శుభ‌వార్త

స్వాతంత్య్ర దినోత్సవం రోజున నిరుద్యోగ యువతకు ముఖ్య‌మంత్రి కేసీఆర్ శుభ‌వార్త అందించారు. ‘తెలంగాణ ఆవిర్భవిస్తే లక్ష ఉద్యోగాలు సిద్ధిస్తాయని ఉద్యమంలో చెప్పా. ప్రభుత్వం లక్షా 12 వేల 536 ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. ఇప్పటివరకు 27,660 ఉద్యోగాలకు నియామక ప్రక్రియ చేపట్టాం. త్వరలో మరో 84,877 ఉద్యోగాల నియామక ప్రక్రియ చేపడతాం. వచ్చే ఏడాది ఏర్పడే ఖాళీలను భర్తీ చేసేందుకు ఈ ఏడాదే నియామకం చేపట్టాలని ఆదేశాలు జారీచేసినట్లు’ కేసీఆర్ వెల్లడించారు.

వివిధ శాఖ‌ల వారీగా భ‌ర్తీ కానున్న‌, అయిన ఉద్యోగాల వివ‌రాలు

మొత్తం పోస్టుల సంఖ్య : లక్షా 12 వేల 536

ఇప్పటికే ఉద్యోగాల భర్తీ : 27 వేల 660

నియామక దశ : 36వేల806 ఉద్యోగాలు

భర్తీకి సిద్ధంగా మరో 48 వేల 70 పోస్టులు

పోలీస్ శాఖలో 37 వేల 820 ఉద్యోగాలు

విద్యుత్ శాఖలో 12 వేల 961 ఉద్యోగాలు

ఉపాధ్యాయ పోస్టులు 12 వేల 005

వైద్య ఆరోగ్య విభాగంలో 8 వేల 347

సింగరేణి గనుల్లో నియామకాలు 7 వేల 485

ఆర్టీసీలో 3 వేల 950 ఉద్యోగాలు

పాత రెసిడెన్షియల్ స్కూళ్లలో 8 వేల 511 పోస్టులు

కొత్త రెసిడెన్షియల్ స్కూళ్ల కోసం 3 వేల 925 పోస్టులు

పంచాయతీ రాజ్ శాఖలో 3 వేల 528 పోస్టులు

రెవెన్యూ విభాగంలో 2 వేల 506 పోస్టులు

అగ్రి, హార్టీ కల్చర్ విభాగంలో 2 వేల 435 పోస్టులు

అటవీ శాఖలో 2 వేల 33 ఉద్యోగాలు

ఉన్నత విద్యా శాఖలో 1678 పోస్టులు

ఇరిగేషన్ విభాగంలో 1058 పోస్టులు

(Visited 421 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *