నంధ్యాల‌కు బాల‌య్య డుమ్మా

నంధ్యాల‌కు బాల‌య్య డుమ్మా

నంధ్యాల ఉప ఎన్నిక‌లలో ఆంధ్రప్రదేశ్ ప్ర‌భుత్వంలోని క్యాబినెట్ యంత్రాంగం, టీడీపీ ప్ర‌జా ప్ర‌తినిధులు అంద‌రూ మోహ‌రించి ప్ర‌చారం చేస్తున్నారు. ఇంత‌కుముందు ఒక‌సారి ప్ర‌చారానికి వ‌చ్చిన ఆంధ్రా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ కు ప్ర‌జ‌ల నుండి ప‌లు ప్ర‌శ్న‌లు ఎదురుకావ‌డంతో ఆయ‌న మ‌ళ్లీ వ‌స్తాడ‌న్న ఊసు వినిపించ‌డం లేదు. ఇక ఇంత‌కుముందు వ‌చ్చిన చంద్ర‌బాబు నాయుడు నా రోడ్లు, నా ఫించ‌న్లు, నా నీళ్లు అన‌డంతో తీవ్ర విమ‌ర్శ‌ల పాల‌య్యాడు.

అయితే ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ ప‌ది రోజుల సుధీర్ఘ ప‌ర్య‌ట‌న పెట్టుకుని గెలుపుకొర‌కు తీవ్రంగా శ్ర‌మిస్తున్నాడు. దీంతో చంద్ర‌బాబుకు గుబులు రేగుతోంది. అందుకే ఈ నెల 19 నుండి మూడు రోజుల ప‌ర్య‌ట‌న ఖ‌రారు చేసుకున్న‌ట్లు తెలుస్తుంది. అయితే నంద‌మూరి కుటుంబంలో కీల‌క‌వ్య‌క్తి, ఎన్టీఆర్ కుమారుడు బాల‌కృష్ణ‌ను మాత్రం నంధ్యాల ప్ర‌చారంలో దించ‌డం లేద‌ని స‌మాచారం.

సాధార‌ణంగా ఆంధ్రా, రాయ‌ల‌సీమ‌ల‌లో సినిమా హీరోలంటే పిచ్చి. అందుకే ఇంకా చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాణ్, బాల‌కృష్ణ లాంటి వాళ్ల మాట‌లు చెల్లుతున్నాయి. అయితే చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌లో చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌జ‌ల‌పై ప్ర‌భావం చూయించాయి. బాల‌కృష్ణ ఏద‌యినా త‌ల‌తిక్క ప్ర‌సంగం చేస్తే మొద‌టికే మోసం వ‌స్తుంద‌ని ఆయ‌న‌ను ఈ ప్ర‌చారం నుండి దూరం పెట్టార‌ని స‌మాచారం. ఇటీవ‌ల ప్రారంభం అయిన ఓ సినిమా షూటింగ్ లో అసిస్టెంట్ ను కొట్టి చెప్పులు వేయించుకోవ‌డం సోష‌ల్ మీడియాలో తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దారి తీసింది. అస‌లే అంతంత మాత్రం ధ‌మాక్ ఉన్న బాల‌కృష్ణ ఇప్పుడు ఏద‌యినా చేస్తే మొత్తం ఎన్నిక‌కే ఎస‌రు వ‌స్తుంద‌ని దూరం పెట్టిన‌ట్లు స‌మాచారం.

(Visited 100 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *